ఆయనో జిల్లా కలెక్టర్.. పాలనా సంబంధిత పనులతో చాలా బిజీగా ఉంటారు. అయితే ఓ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.. అక్కడి విద్యార్థులకు పాఠాలు బోధించారు. చాలా ఓపికగా మ్యాథ్స్ పాఠాలు చెప్పారు. ఏకంగా జిల్లా కలెక్టరే పాఠాలు చెబుతుంటే ఆ విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పాఠాలు చెప్పడమే కాదు అవి ఎంతవరకు విద్యార్థులకు అర్థమయ్యేయో అనే విషయం ఆ విద్యార్థులను ప్రశ్నలు అడిగి మరీ తెలుసుకున్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.. జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పరిపాలనలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అధికారులపై ప్రజలకు నమ్మకంతో పాటు ధైర్యాన్ని పెంచే విధంగా పాలన సాగిస్తుంటారు.
తాజాగా.. మెదక్ జిల్లా శంకరంపేట ఆర్ మండల జిల్లా పరిషత్ స్కూల్‌ను కలెక్టర్ పరిశీలించాను. అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. వారి సమస్యలను తెలుసున్నారు. అనంతరం టీచర్ అవతారమెత్తి పదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. వారిని ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు చెప్పారు. జిల్లా కలెక్టర్ పాఠాలు చెప్పటంతో ఆ స్కూళ్లో చదివే విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయారు. అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్.. మీడియాతో మాట్లాడారు. ఈ స్కూల్‌లో అటెండెన్స్ చాలా తక్కువగా ఉందని అన్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి స్కూల్‌కు వస్తున్నట్లు విద్యార్థులు చెప్పినట్లు వెల్లడించారు.
‘పక్కనే హాస్టల్స్ కూడా ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. హాస్టల్స్‌లో కూడా అటెండెన్స్ తక్కువగా ఉన్నట్లు తెలిసింది. అక్కడికి సబంధిత అధికారులను పంపించి హాజరు శాతం తక్కువ ఉండటానికి గల కారణాలు తెలుసుకుంటాం. అక్కడ హాజరు శాతం పెరగటానికి ఏం ఏం చేయాల్నో ఆ చర్యలు తీసుకుంటాం. ఈ స్కూళ్లో విద్యార్థులకు కొంచెం మెమెురీ సామర్థ్యం తక్కువగా ఉంది. ఈ విషయంపై అక్కడి టీచర్లను అడిగి తెలుసుకున్నాం. వచ్చే రెండు నెలల్లో వారి సామర్థ్యాన్ని మెరుగు పరుస్తాం అని టీచర్లు హామీ ఇచ్చారు.