బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలను చేస్తూ హిట్స్ కొడుతూ దూసుకు పోతున్నారు. అఖండ, వీరి సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో సక్సెస్ లను అందుకున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ దసరా సందర్భంగా బాబీ సినిమా టైటిల్ ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బాలయ్య ప్రస్తుత సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే అఖండ 2 సినిమాను పట్టాలెక్కించేందుకు బోయపాటి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయిందని, బాలయ్య లుక్ టెస్ట్ జరుగుతుందని తెలుస్తోంది.
అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లుగా అఖండ 2 మేకర్స్ చెబుతున్నారు. ఈ సమయంలో బాలయ్య అఖండ 2 కోసం తీసుకోబోతున్న పారితోషికం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. అఖండ 2 కోసం బాలకృష్ణ గతంలో ఎప్పుడు లేనంతగా రూ.30 కోట్ల పారితోషికంను అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. భగవంత్ కేసరి సినిమాతో పాటు ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు గాను పాతిక కోట్ల లోపు పారితోషికంను అందుకున్నారట. ఇప్పుడు అఖండ 2 కోసం రూ.30 కోట్లు పారితోషికంగా అందుకోబోతున్నారు. రవితేజ, నాని లు ఇప్పటికే రూ.30 కోట్లు పారితోషికం అందుకుంటున్నారు. వారితో పాటు ఇప్పుడు బాలయ్య రూ.30 కోట్ల పారితోషికంను అందుకుంటున్నారు.