నాని, ప్రియాంక మోహన్‌లతో వివేక్ ఆత్రేయ తీసిన చిత్రం సరిపోదా శనివారం. ఈ చిత్రంలో విలన్‌గా ఎస్ జే సూర్య నటించాడు. ఆల్రెడీ టీజర్, ట్రైలర్‌లతో పోతారు.. మొత్తం పోతారు అంటూ హైప్ క్రియేట్ చేశారు. ఆగస్ట్ 29న ఈ చిత్రం థియేటర్లోకి వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో షోలు పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల షోలు కూడా పడ్డాయి. దీంతో తెల్లవారు ఝాము నుంచే ట్విట్టర్‌లో సరిపోదా హంగామా నడుస్తోంది. ఇప్పటికే నాని ఫ్యాన్స్ ట్విట్టర్‌ను ఊపేస్తున్నారు.
ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉందో మామూలుగా లేదు.. మామూలు హై కాదు.. పోతారు..మొత్తం పోతారు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదొక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ మూవీ కాకపోతే.. శనివారం మాత్రమే ఫైట్ చేస్తాడనే కాన్సెప్ట్‌తో ఉంటుందట. నాని, ఎస్ జే సూర్యల పర్ఫామెన్స్ అదిరపోయిందట. యాక్షన్ సీక్వెన్స్ ఫీస్ట్‌లా ఉంటుందట. ఆర్ఆర్ మాత్రం పగిలిపోయిందంటూ ట్వీట్లు వేస్తున్నారు.
వివేక్ స్క్రీన్ ప్లే మరీ అంత గొప్పగా ఏమీ లేదు.. ఎస్ జే సూర్య, నానిల కోసం ఈ సినిమాను థియేటర్లో చూడాల్సిందే.. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది.. పోతారు.. మొత్తం పోతారు.. ఇక సెకండాఫ్ వచ్చే సరికి కాస్త బోరింగ్ అనిపిస్తుందట.. మాస్‌ను మాత్రం ఎంటర్టైన్ చేస్తుందట..బీజీఎం మాత్రం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందని అంటున్నారు.
రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలే అయినా కూడా ఇందులో నాని, ఎస్ జే సూర్యల పర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంటుందని, వారిద్దరి కోసమైనా సరే ఈ మూవీని థియేటర్లో చూడాల్సిందే అంటూ అందరూ చెబుతున్నారు.
ట్విట్టర్‌లో పూర్తిగా పాజిటివ్ టాక్ మాత్రమే కాకుండా నెగెటివ్ కూడా కనిపిస్తోంది. సినిమాను చూసి కామెంట్ చేస్తున్నారో.. లేక ఏదో ఒక సర్చ్ వస్తుందని ఇలా కామెంట్ చేస్తున్నారో తెలియడం లేదు. కానీ పాజిటివ్, నెగెటివ్ కామెంట్లు అయితే కనిపిస్తున్నాయి. కొందరు చేసిన ట్వీట్లను ఉన్నది ఉన్నట్టుగా కాపీ చేసుకుని మరొకరు ట్వీట్లు చేసుకుంటున్నారు. అంటే చాలా మంది కావాలనే సర్చ్ కోసం ఇలా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఏది ఏమైనా సరిపోదా టాక్ పూర్తిగా తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.
నాని వివేక్ ఆత్రేయ కాంబోకి సరైన కమర్షియల్ సక్సెస్ రాలేదు. నాని, ప్రియాంక మోహన్ కాంబోకి కూడా సరైన విజయం దక్కలేదు. ఇప్పుడు మంచి ఫాంలో ఉన్న ఎస్ జే సూర్యను ఈ మూవీలోకి తీసుకొచ్చారు. మరి నాని, ప్రియాంక, వివేక్ ఆత్రేయలకు ఎస్ జే సూర్య లక్ ఫ్యాక్టర్ కలిసి వస్తుందా? లేదా? అన్నది చూడాలి.