మంగళగిరి ప్రజల కోసం లోకేష్ ‘ప్రజాదర్బార్’

మంగళగిరి ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ నిర్వహించనున్నారు. తొలి అడుగులోనే యువనేత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లి నివాసంలో ప్రజలను లోకేష్ కలుసుకున్నారు. గత అయిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసును నారా లోకేష్ గెలిచారు.

అమరావతి: మంగళగిరి ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ నిర్వహించనున్నారు. తొలి అడుగులోనే యువనేత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లి నివాసంలో ప్రజలను లోకేష్ కలుసుకున్నారు. గత అయిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసును నారా లోకేష్ గెలిచారు. ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించాక శాసనసభ్యుడిగా సరికొత్త వరవడికి శ్రీకారం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ నిర్వహించారు.

ఉండవల్లిలోని నివాసంలో లోకేష్ స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నారు. నియోజకవర్గంలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేశారు. 2019 నుంచి కూడా లోకేష్ నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గ ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచారు. సొంత నిధులతో 29 సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి మంగళగిరి ప్రజల మనసును లోకేష్ గెలుచుకున్నారు. స్థానికేతర కార్యక్రమాలకు వెళ్లినపుడు మినహా ఉండవల్లిలో ఉన్నపుడు ప్రతిరోజూ ఉదయం లోకేష్ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *