పీవీ సింధు స్టన్నింగ్‌ షో.. మూడో ఒలింపిక్‌ మెడల్‌ దిశగా విజయం

తెలుగుతేజం పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన ఫాతిమత్‌ అబ్దుల్‌ రజాక్‌పై 21-9, 21-6తో వరుస సెట్లలో గెలిచి.. శుభారంభం చేసింది. తాజాగా బుధవారం ఎస్తోనియా క్రీడాకారిణి క్రిస్టిన్‌ కుబాను సైతం ఓడించింది.

తొలి మ్యాచ్‌కు మించి బుధవారం జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు సత్తాచాటింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్‌ను 21-5తో సొంతం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన రెండో సెట్‌లో క్రిస్టిన్‌ కుబా కాస్త ప్రతిఘటించినా.. సింధు ముందు నిలవలేకపోయింది. రెండో సెట్‌ను సైతం 21-10తో కైవసం చేసుకున్న భారత బ్యాట్మింటన్‌ స్టార్.. విశ్వక్రీడల్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఒలింపిక్స్‌లో మూడో పతకం దిశగా మరో అడుగు ముందుకేసింది. రౌండ్‌ ఆఫ్‌ 16కు చేరింది.

ఇటీవల కాలంలో ఫామ్ లేక ఇబ్బంది పడ్డ సింధు.. విశ్వక్రీడల్లో మాత్రం సత్తాచాటుతోంది. ఎదురైన ప్రత్యర్థిని చిత్తు చేస్తూ.. దూసుకెళ్తోంది. రియో ఒలింపిక్స్‌ 2016లో రజత పతకాన్ని కైవసం చేసుకున్న ఈ తెలుగుతేజం.. టోక్యో ఒలింపిక్స్‌ 2020లో కాంస్య పతకాన్ని సాధించింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో ఎలాగైనా స్వర్ణం ముద్దాడాలనే లక్ష్యంతో సత్తాచాటుతోంది. ఈసారి ఏ పతకం సాధించినా.. హ్యాట్రిక్‌ ఒలింపిక్‌ మెడల్స్‌ సాధించిన క్రీడాకారుల జాబితాలో సింధు చేరనుంది.

About rednews

Check Also

భారత్ 46 ఆలౌట్.. సొంత గడ్డపై అత్యల్ప స్కోరు.. కివీస్ పేసర్ల ధాటికి విలవిల్లాడిన బ్యాటర్లు..!

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత జట్టు కుప్పకూలింది. పేకమేడను తలపిస్తూ.. భారత బ్యాటర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *