అరియానా ప్రెగ్నెన్సీ ఇష్యూలో కొత్త ట్విస్ట్.. రాజ్ తరుణే కడుపుచేశాడన్న ఆరోపణలపై ఫస్ట్ రియాక్షన్

అమ్మ బాబోయ్ రాజ్ తరుణ్ ఇష్యూలో రోజుకో రంకుబాగోతాన్ని బయటపెడుతోంది అతని మాజీ ప్రేయసి లావణ్య. అటు రాజ్ తరుణ్.. ఇటు మస్తాన్ సాయిలతో ఎఫైర్ నడిపిందంటూ.. మస్తాన్ సాయి వల్లే లావణ్య నెలతప్పిందని.. ఆ టైంలో ఆమెకు సాయంగా వచ్చిన ప్రియ అనే అమ్మాయికి కూడా డ్రగ్స్ అలవాటు చేసిందని రాజ్ తరుణ్ స్నేహితుడు శేఖర్ బాషా ఆరోపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాను నెలతప్పడం కాదని.. రాజ్ తరుణ్ వల్ల అరియానా నెల తప్పిందని అందుకే ఆమె లావు అయ్యిందని బాంబ్ పేల్చింది లావణ్య.

తాను గోవా వెళ్లిన సందర్భంలో రాజ్ తరుణ్.. అరియానాతో ఉండేవాడని.. అరియానా తన ఫ్లాట్‌కి రాజ్ తరుణ్ రప్పించుకునేదని.. వాళ్ల ఎఫైర్ విషయాన్ని రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్రే తనకి చెప్పాడని గతంలో చెప్పింది లావణ్య. ఈమె మాటల్లో నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు కానీ.. తాజాగా ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్.. అరియానాకి కడుపు చేశాడంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది లావణ్య.


‘‘నన్ను వదిలేసిన తరువాత రాజ్ తరుణ్.. అరియానాతో రిలేషన్‌లో ఉన్నాడు. అరియానా ప్రెగ్నెంట్ కూడా అయ్యింది. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. అసలు అరియానాతో రాజ్ తరుణ్ వాళ్ల డాడ్ ఎందుకు మాట్లాడాడు? అరియానాని ఏమని మోసం చేశాడు? అరియానా ఎందుకు ప్రెగ్నెంట్ అయ్యింది?? బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు.. ఎంతో సన్నగా ఉన్న అరియానా.. బయటకు వచ్చిన తరువాత రాజ్ తరుణ్ ప్రెగ్నెంట్ చేయడం వల్ల లావు అయ్యింది. తన అందాన్ని పోగొట్టుకుంది. ఎంత మంచిగా ఉండే అమ్మాయి ఇప్పుడు ఎలా అయ్యిందో

రాజ్ తరుణ్‌తో అరియానా ఉంటుందని నాకు తెలిసి.. నేను వార్నింగ్ ఇచ్చాను.. ఆ తరువాత నాకు సారీ చెప్పింది.. ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయిన తరువాత తెలిసింది.. అరియానా రాజ్ తరుణ్ వల్లే ప్రెగ్నెంట్ అయ్యిందని’ అంటూ అరియానా ప్రెగ్నెంట్ ఇష్యూని బయటపెట్టింది లావణ్య. అయితే లావణ్య మాటల్లో నిజం లేదని అంటున్నారు శేఖర్ బాషా.

‘‘అరియానా ప్రెగ్నెంట్ ఏంటండీ బాబూ.. ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది అందుకే లావు అయ్యిందని అంటుంది. ఈ విషయంపై నేను అరియానాతో కూడా మాట్లాడాను. ఆడపిల్లకి న్యాయం చేయాలని అంటుంది.. అదే ఆడపిల్లపై ఇంత నీఛంగా నిందలెలా వేస్తుందని ఆమె చాలా బాధపడుతుంది. నేను లావు అవ్వడానికి ప్రెగ్నెంట్‌కి సంబంధం ఏంటి? నేను సినిమాల కోసం లావు అయ్యాను.. దానికి బుద్ది ఉందా? అని అడిగింది. అరియానా త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది.

ఇలాంటి నిందలు వేస్తే.. ఆమె ఫ్యూచర్ ఏమవ్వాలి? ఇదేనా లావణ్య సంస్కారం. అరియానా ప్రెగ్నెంట్.. ఇలియానా ప్రెగ్నెంట్ అంటుంది అంటే ఎలా?? అంటూ లావణ్యపై ఫైర్ అయ్యాడు శేఖర్ బాషా. కాగా లావణ్య తనను రౌడీలతోకొట్టించిందని హాస్పిటల్‌లోచేరాడు శేఖర్ బాషా. మొత్తానికి రాజ్ తరుణ్ ఇష్యూలో పాత్రలు, పాత్రధారులు చాలామందే తెరపైకి వస్తున్నారు. అన్నట్టు సందెట్లో సెడేమియా అన్నట్టుగా రాజ్ తరుణ్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ అయిపోయాక ఇంకా ఈ లొల్లి ఏందో మరి.

About rednews

Check Also

అనంతపురం జిల్లాలో భారీ వానలు.. వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున

బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో భారీ వర్షాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *