నేటి అలంకరణ శ్రీ మహాచండీదేవి ఆశ్వీయుజ శుద్ధ పంచమి, సోమవారం

శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఐదో రోజున విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ మహాచండీదేవిగా దర్శనమిస్తారు.

రన్నవరాత్రి మహోత్సవాల్లో ఐదో రోజున విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ మహాచండీదేవిగా దర్శనమిస్తారు. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతుల త్రిశక్తి స్వరూపిణిగా శ్రీమహాచండీ అమ్మవారు ఉద్భవించారు. ఆమెలో అందరు దేవతలు కొలువై ఉన్నారు. అందుకే శ్రీమహాచండీ దేవివి ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్టేనంటారు పెద్దలు. శ్రీమహాచండీ అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. ఏ కోరికలతో భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తారో ఆ కోరికలన్నీ సిద్ధిస్తాయనేది భక్తుల విశ్వాసం.

  • నైవేద్యం: కదంబం, చక్కెర పొంగలి, పులిహోర, లడ్డూ, రవ్వకేసరి, కట్టె పొంగలి
  • అలంకరించే చీర రంగు: ఎరుపు
  • అర్పించే పూల రంగు: ఎరుపు
  • పారాయణ: చండీ సప్తశతి, లలితా సహస్రనామ స్తోత్రం, శ్రీ దేవీ ఖడ్గమాల

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *