తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. ఉచితంగా దర్శనం, వసతి.. ఒక్కరోజే, బుక్ చేస్కోండి

తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదులు, అంగప్రదక్షిణలు, శ్రీవారి సేవలకు సంబంధించి ప్రతి నెలా ఆన్‌లైన్‌ కోటాను విడుదల చేస్తోంది. ఇప్పటికే ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి గదుల్ని విడుదల చేయగా.. భక్తులు బుక్ చేసుకున్నారు. అయితే ఈ నెల 27న డిసెంబర్ నెలకు సంబంధించి శ్రీవారి సేవ కోటా విడుదల చేయనుంది టీటీడీ. శుక్రవారం (సెప్టెంబరు 27)రోజున తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు విడుదల చేస్తుంది టీటీడీ. అలాగే న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారని తెలిపారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈ శ్రీవారి సేవ కోటాను బుక్ చేసుకోవాల‌ని కోరింది టీటీడీ.

మరోవైపు తిరుమల సేవాసదన్- 2లో సత్సంగ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన శ్రీవారి సేవకులతో అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమావేశమయ్యారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవకులు అత్యంత క్రమశిక్షణ, అంకితభావం, భక్తి శ్రద్ధలతో సేవలు అందించడమే కాకుండా యాత్రికులకు అందుతున్న వివిధ సేవలపై అభిప్రాయ సేకరణ చేయాలని వెంకయ్య చౌదరి సూచించారు. శ్రీవారి సేవకులు స్వామివారి భక్తులకు సేవలందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

శ్రీవారి సేవకులు తాము సేవలందించే ప్రాంతాలలో భక్తులకు అందుతున్న సదుపాయాలను గమనించి, వాటిపై అభిప్రాయ సేకరణను చేసి తమకు అందించి, తద్వారా వారికి అందుతున్న సౌకర్యాలు మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించాలని కోరారు అదనపు ఈవో. ఆన్‌లైన్‌లో శ్రీవారి సేవ రిజిస్ట్రేషన్‌తోపాటు, ఎలక్ట్రానిక్‌ డిప్‌ సిస్టమ్‌ ద్వారా ఆలయ విధుల కేటాయింపులు ఎంతో పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం శ్రీవారి సేవకులకు ఆయనే స్వయంగా ఈ-డిప్‌ విధానంలో ఆలయ డ్యూటీని విడుదల చేశారు.

అంతకుముందు శ్రీవారి సేవకులు కొరకు భజన, ధ్యాన కార్యక్రమాలు జరిగాయి . ఈ కార్యక్రమంలో చీఫ్ పీఆర్వో డాక్టర్ టీ రవి, పీఆర్వో పి.నీలిమ, శ్రీవారి సేవ, ప్రజా సంబంధాల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు అక్టోబరు 4న వార్షిక బ్రహ్మోత్సవాల తొలిరోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన దృష్ట్యా శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం, పాంచజన్యం, తదితర ప్రాంతాలను అదనపు ఈవో సంబంధిత అధికారులతో పరిశీలించారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *