రజినీకాంత్ ఆరోగ్యంపై ఫ్యాన్స్‌లో ఆందోళన.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ఆరోగ్యం విషయమై గత రెండు రోజులుగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. కడుపు నొప్పితో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయిన రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితి ఏంటో అర్థం కాక ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సూపర్‌‌స్టార్‌ హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేయాలంటూ డిమాండ్‌ చేస్తూ సోషల్‌ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో కొందరు అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. ఎట్టకేలకు అపోలో ఆసుపత్రి వర్గాల నుంచి అధికారికంగా హెల్త్‌ బులిటెన్ విడుదల అవ్వడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

అపోలో వైద్యులు విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో రజనీకాంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని పేర్కొన్నారు. అంతే కాకుండా ఆయన త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని కూడా పేర్కొన్నారు. రజనీకాంత్‌ భార్య లత సైతం స్పందించారు. ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన పని లేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆమె తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా కొందరు కావాలంటూ పుకార్లు పుట్టించి ఫ్యాన్స్ ను ఆందోళనకు గురి చేసిన నేపథ్యంలో అభిమాన సంఘం నాయకులు సైతం సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దంటూ విజ్ఞప్తి చేశారు.

రజనీకాంత్ గత కొన్ని రోజులుగా వేట్టయాన్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు, ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఆయన సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనకర వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు. కొన్ని గంటల పాటు ఏం జరుగుతుందో తెలియక పోవడంతో గందరగోళానికి గురి అయ్యారు. వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేయడంతో టెన్షన్‌ వీడినట్లు అయింది.

About rednews

Check Also

అనంతపురం జిల్లాలో భారీ వానలు.. వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున

బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో భారీ వర్షాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *