Tag Archives: Anantapur

అనంతపురం జిల్లాలో భారీ వానలు.. వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున

బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈ రెండు జిల్లాలలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ కార్యక్రమం కోసం అనంతపురం జిల్లాకు వెళ్లిన టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున.. ఈ వరదల్లో చిక్కుకున్నారు. ఓ జ్యువెలరీ షాప్‌కు నాగార్జున బ్రాండ్ అంబాసిడర్ అన్న సంగతి తెలిసిందే. ఈ జ్యువెలరీ షాపు అనంతపురంలో కొత్త బ్రాంచ్ ప్రారంభించింది. అయితే ఈ …

Read More »

అనంతపురాన్ని ముంచెత్తిన పండమేరు.. విజయవాడ వరదల్లాగే, నీట మునిగిన కాలనీలు

విజయవాడను బుడమేరు వరద ముంచెత్తితే.. అనంతపురంపై పండమేరు విరుచుకుపడింది. సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలకు నగరంలోని కాలనీలు నీటమునిగాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం దెబ్బకు.. అనంతపురంనకు ఆనుకుని ఉన్న పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.. దీంతో వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వాగుకు అంతకంతకు వరద ప్రవాహం పెరుగడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూశారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వర …

Read More »

అనంతపురం: రాముడి రథానికి నిప్పు.. చంద్రబాబు సీరియస్, రంగంలోకి స్పెషల్ టీమ్స్

అనంతపురం జిల్లాలో రామాలయంలో రథానికి నిప్పు పెట్టిన ఘటన కలకలంరేపింది. కనేకల్ మండలం హనకనహాల్‌లో రామాలయం ఉంది.. అక్కడ మంగళవారం అర్ధరాత్రి రాముడి రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా.. స్థానికులు గమనించి మంటల్ని ఆర్పేశారు. కానీ అప్పటికే రథం సగానికి పైగా కాలిపోయింది. పుణ్యతిథులు, ఉత్సవాల సమయంలో రాములవారిని రథంపై ఊరేగిస్తుంటారు. మిగతా సమయంలో ఓ షెడ్డులో రథాన్ని భద్రపరుస్తారు. రథానికి నిప్పు పెట్టారనే సమాచారం అందుకున్న కళ్యాణదుర్గ డీఎస్పీ రవిబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్రిమినల్ …

Read More »

అనంతపురం వరకు ఆ రైలు పొడిగింపు.. బెంగళూరుకు ఈజీగా వెళ్లొచ్చు

ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులకు రైల్వేశాఖ తీపికబురు చెప్పింది. బెంగళూరు-పుట్టపర్తి ప్యాసింజర్‌ రైలు (06515/06516)ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్యాసింజర్ రైలును పుట్టపర్తి వరకు కాకుండా అనంతపురం వరకు పొడిగించినట్లు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి నిత్యం బెంగళూరుకు రాకపోకలు ఉంటాయి.. ఇప్పుడు ఈ రైలును అనంతపురం వరకు పొడిగిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రయాణికులు చెబుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు పుట్టపర్తితో పాటుగా బెంగళూరుకు వెళ్లేందుకు రైలు సౌకర్యం కల్పించాలని అంబికా లక్ష్మీనారాయణ …

Read More »

ఎలుగుబంట్ల దాడులతో అన్నదాతల బెంబేలెత్తిపోతున్నారు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎలుగుబంట్ల దాడులతో అన్నదాతల బెంబేలెత్తిపోతున్నారు. పొలాల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. తాజాగా తెల్లవారుజామున పాల వెంకటాపురంలో పొలం పనులకు వెళ్తున్న రైతులకు ఎలుగుబంటి కనిపించింది. తప్పించుకునే ప్రయత్నంలో రైతులు నానాతంటాలు పడ్డారు. ఎలుగుబంటి రైతుల మీద దాడి చేసేందుకు ప్రయత్నించగా రైతులంతా కలిసి గట్టి గట్టిగా అరుస్తూ.. శబ్దాలు చేస్తూ ద్విచక్ర వాహనాల్లో ఎలుగుబంటిని వెంబడించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎలుగుబంట్ల దాడులతో అన్నదాతల బెంబేలెత్తిపోతున్నారు. పొలాల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. తాజాగా తెల్లవారుజామున పాల వెంకటాపురంలో పొలం పనులకు …

Read More »