Tag Archives: andhr apradesh

ఏపీకి కేంద్రం బిగ్ రిలీఫ్.. భారీగా నిధులు విడుదల, ఎన్ని కోట్లంటే

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఊరట ఇచ్చింది.. రాష్ట్రంలోని పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లకు కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.989 కోట్లు విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా ఈ నిధుల్ని అందిస్తున్నట్లుగా కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిధులు వారం, పది రోజుల్లో నిధులు ఖజానాకు జమ చేసే అవకాశం ఉంది. గత నెలలో పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లకు 2023-24 సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం ఇచ్చిన రూ.724 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వీటి …

Read More »

గాడిద పాల పేరుతో రైతులకు కుచ్చు టోపీ.. రూ.9 కోట్లు దోచేసిన ఏపీకి చెందిన సంస్థ

గాడిద పాల వ్యాపారం పేరుతో కర్ణాటక రైతులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంస్థ నిండా ముంచేసింది. మొత్తం 200 మంది సామాన్య రైతుల నుంచి ఏకంగా రూ.9 కోట్లు దండుకుంది. చివరకు ఇది బోగస్ అని తేలడంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాకు చెందిన నూతలపాటి మురళి.. మూడు నెలల కిందట ‘జెన్ని మిల్క్‌’ అనే పేరుతో ఓ సంస్థ ఏర్పాటుచేశాడు. హొసపేటెలోని హంపీ రోడ్డులో హంగూ ఆర్భాటాలతో దీనిని ప్రారంభించి.. ఉద్యోగులను నియమించుకున్నాడు. గాడిద పాల వ్యాపారం చేస్తే లక్షాధికారులు …

Read More »

భారీ వర్షాల వేళ విజయవాడకు అమావాస్య గండం.. బిక్కుబిక్కుమంటున్న జనం

రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలను వణికిస్తున్నాయి. గత 2, 3 రోజుల నుంచి కురుస్తున్న ఏకధాటి వర్షానికి నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక జలాశయాలు, ప్రాజెక్టులు నిండిపోవడంతో.. గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇక తెలంగాణలోని ఖమ్మం, హైదరాబాద్.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు.. ప్రళయాన్ని తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మనిషి మునిగే లోతులో వరదనీరు చేరింది. సహాయం కోసం వరద బాధితులు.. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం అమావాస్య కావడంతో.. …

Read More »

ఆ ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్.. మంత్రులకు కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశంలో తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అన్నారు. ఇన్నాళ్లు పార్టీ నిర్మించుకున్న మంచిపేరును కొందరు ఎమ్మెల్యేలు దెబ్బతీస్తున్నారని మంత్రులతో అన్నారు. ఆ ఎమ్మెల్యేలు చేసిన పొరపాట్లు పేపర్లలో వస్తున్నాయని ప్రస్తావించిన చంద్రబాబు.. వారికి వార్నింగ్ ఇచ్చారు. అలాంటి ఎమ్మెల్యేల పట్ల మంత్రులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వారి వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తోందని చంద్రబాబు విచారం వ్యక్తం చేవారు. ఇదే సమయంలో మంత్రులు కూడా …

Read More »

చంద్రబాబు హామీ.. 24 గంటల్లోనే డ్రైవర్‌కు ఆటో అందజేత.. ఆసక్తికర సన్నివేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో ఆటో డ్రైవర్‌కు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గురువారం గుడివాడ రామబ్రహ్మం పార్కులోని అన్న క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పునఃప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కృష్ణా జిల్లా గుడివాడ మండలం వలివర్తిపాడుకు చెందిన ఆటో డ్రైవర్‌ రేమల్లి రజినీకాంత్‌తో మాట్లాడారు. ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలనూ ఉన్నత విద్య చదివిస్తున్నానని ఆయన సీఎంకు వివరించారు. రజినీకాంత్ కుమారుడు రవితేజ తాను ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తన చెల్లి బీడీఎస్‌ చదువుకు …

Read More »

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మరో ఏడాది ఉచితం, ఉత్తర్వులు జారీ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హైకోర్టు, రాజ్‌భవన్‌ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు వసతి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయం, హెచ్‌వోడీ, అసెంబ్లీ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి కొనసాగిస్తున్నారు. తాజాగా హైకోర్టు, రాజ్‌భవన్‌ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి పొడిగించారు.. 2025 జూన్‌ 26 వరకు ఉచిత వసతి కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు. ఉచిత వసతి పొడిగించినందుకు ప్రభుత్వానికి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆ టోకెన్లు పెంచే ఆలోచనలో టీటీడీ..

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అలా వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ నిత్యం కృషి చేస్తూ ఉంటుంది. అయితే రద్దీ వేళల్లో శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించాల్సి ఉంటుంది. ఈ సమయాన్ని తగ్గించేందుకు కూడా టీటీడీ చర్యలు ప్రారంభించింది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.టీటీడీ పరిపాలన భవనంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఉద్యోగులను …

Read More »

ఏపీలో వెయిటింగ్‌లోని ఐపీఎస్‌లకు మెమోలు.. ఆ కేసులు నీరుగార్చేలా, నిఘా విభాగం సంచలనాలు

ఏపీలో వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు డీజీపీ మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎస్‌లకు మెమోలు జారీ వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇటీవల విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా కొందరు ఐపీఎస్‌లు కుట్ర చేసినట్లు రాష్ట్ర ఇంటిలిజెన్స్ (నిఘా) విభాగం గుర్తించిందట. వివిధ కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు సాగించినట్లు డీజీపీ కార్యాలయం గుర్తించారట. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతో.. వెంటనే డీజీపీ కార్యాలయం అలర్ట్ అయ్యింది. వెయిటింగ్‌లో …

Read More »

ఏపీ కేబినెట్ భేటీ ఆగస్టు 7కు వాయిదా.. 

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి ఆగస్టు 2న మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉండగా వాయిదా పడింది.. ఆగస్టు 7న సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆగస్టు 1న శ్రీశైలం పర్యటనకు వెళతారు.. అలాగే శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమలలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. వరుస పర్యటనల కారణంగానే కేబినెట్ భేటీని వాయిదా వేశారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశానికి సంబంధించి వివిధ …

Read More »

ఏపీలో మరోసారి ఎన్నికలు.. ఆగస్టు 30న పోలింగ్, మూడు జిల్లాల్లో కోడ్ అమల్లోకి

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైఎస్సార్‌సీపీ తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్‌ గెలిచారు. అయితే ఆయన జనసేన పార్టీలో చేరగా.. అనంతరం అనర్హత వేటు వేయడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. ఆ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్ వచ్చిందని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. ఆగస్టు 6న ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విడుదలవుతుంది.. …

Read More »