Tag Archives: andhra pradesh

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన శాంతి హోమం.. అనంతరం పంచగ్రవ్య సంప్రోక్షణ

తిరుమల శ్రీవారి ఆలయంలో మహా శాంతి హోమం మొదలైంది. శ్రీవారి ప్రసాదం లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కోసం అర్చకులు, అధికారులు శాంతిహోమం సంకల్పించారు. ఈ మేరకు ఆలయంలోని యాగశాల వద్ద ఉదయం 6 గంటల నుంచి 10 గంటలకు ఈ హోమాన్ని అర్చకులు చేయనున్నారు. హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం..! అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు.. భక్తవత్సలుడు కొలువైన ప్రాంతం..! అలాంటి తిరుమల కొండపై.. ఆ దేవదేవుడి కైంకర్యాలకు, లడ్డూ ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి కల్తీ అయ్యిందనే వార్త పెను సంచలనమే …

Read More »

టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు బంపరాఫర్.. ఇలా చేస్తే ఒక్కొక్కరికి రూ.5లక్షలు, పదవులపై కీలక ప్రకటన!

తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తీపికబురు చెప్పారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేస్తామని ప్రకటించారు. పార్టీకి కార్యకర్తలే బలమని.. వారి త్యాగాలను మర్చిపోలేమన్నారు. ఆదివారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, గ్రామ పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు భావిస్తున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి …

Read More »

ఏపీలో వారందరి పింఛన్లు కట్.. కీలక ఆదేశాలు, ఆ ఛాన్స్ ఉంటుంది!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన కొత్తవారికి పింఛన్లు ఇస్తామని ప్రకటించగా.. ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియకు సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో అనర్హులపై వేటుకు సిద్ధమవుతున్నారు.. అర్హత లేకపోయినా సరే కొందరు పింఛన్లు తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. దీంతో అలాంటివారిపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. అనర్హుల ఏరివేతకు కసరత్తు మొదలుపెట్టింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేతలు.. ఇలా అన్ని విభాగాల్లో స్థానికంగా ఉండే నేతలు సిఫార్సు చేయడంతో చాలామంది అనర్హులకు పింఛన్లు ఇచ్చారనే …

Read More »

జగన్‌కు తలనొప్పిలా మారిన మంత్రి నారాయణ పెట్టిన కేసు.. మరోసారి హైకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై విజయవాడలోని ప్రజాప్రతినిధులపై కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానంలో మంత్రి నారాయణ దాఖలు చేసిన పరువునష్టం కేసును కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారు. తన పరువుకు నష్టం కలిగించేలా.. రాజధాని అమరావతి భూముల విషయంలో సాక్షి పత్రికలో వార్తను ప్రచురించారని అప్పటి మంత్రి నారాయణ.. 2018లో విజయవాడలోని ప్రత్యేక కోర్టులో క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు …

Read More »

ఏకంగా 13 రోజులు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. Dussehra Holidays తేదీలివే!

అక్టోబర్‌ నెలలో తెలంగాణలోని స్కూళ్లకు వరుసగా 13 రోజులు దసరా (Dasara Holidays) సెలవులు రానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో.. అక్టోబర్ 15వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో ఈసారి ఏకంగా 13 రోజుల పాటు దసరా సెలవులు రానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి (Gandhi Jayanti 2024) నాడు సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు …

Read More »

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. టీటీడీ సంచలన నిర్ణయం, వెంటనే అవి కూడా రద్దు

తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగిస్తున్న కల్తీ నెయ్యిని ఉపయోగించారనే అంశంపై టీటీడీ కూడా స్పందించింది. తాను టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి తిరుమలలో పరిపాలనాపరంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు శ్యామలరావు. లడ్డూకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అయితే టీటీడీ లడ్డూ ప్రసాదం నెయ్యితో పాటుగా తిరుమల శ్రీవారి నైవేద్య అన్న ప్రసాదాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. తిరుమల ఆలయంలో శ్రీవారి నైవేద్య అన్నప్రసాదాలలో వినియోగించే గో ఆధారిత ముడి సరుకులైన నెయ్యి, బెల్లం, బియ్యాలను తాత్కాలికంగా రద్దు …

Read More »

పవన్ కళ్యాణ్ ఆలోచన బాగుంది.. చిలుకూరు ప్రధానార్చకులు రంగరాజన్

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై దుమారం రేగుతోంది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. పలువురు ప్రముఖులు ఇప్పటికే స్పందించారు. తాజాగా ఈ వివాదంపై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్ కూడా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటం దారుణమని.. ఇది భయంకరమైన, నమ్మలేని నిజం అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించి నెయ్యి కోసం టెండరింగ్ ప్రక్రియ చేపట్టడాన్ని తప్పుబట్టారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీపై సమగ్ర …

Read More »

విజయవాడలో వెరైటీ దొంగ.. ఆ టైంలో మాత్రమే చోరీలు, రాత్రిళ్లు మాత్రం!

విజయవాడలో ఓ దొంగ ఆట కట్టించారు పోలీసులు. కొద్దిరోజులుగా నగరంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో చోరీలు చేస్తున్నట్లు గుర్తించారు. మనోడి గురించి ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. మనోడు రాత్రిళ్లు చోరీలు చేయడం.. దానికి కూడా టైమింగ్స్ ఉంటాయి.. మనోడి ట్రాక్ రికార్డ్ చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. మహంతిపురంకు చెందిన షేక్ షబ్బీర్‌బాబు చెడు వ్యసనాలకు బానిసగా మారాడు.. జల్సాల కోసం డబ్బులు కావాలి.. అందుకే విజయవాడలో దొంగతనాలు మొదలుపెట్టాడు. దీని కోసం ముందుగానే ఓ ప్లాన్ వేసుకుంటాడు. విజయవాడలో పగటి …

Read More »

ఏపీలో మరో పథకం అమలు.. అకౌంట్‌లో నెలకు రూ.3వేలు, వెంటనే దరఖాస్తు చేస్కోండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పింఛన్ పెంపు, మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల హామీల అమలుపైనా ఫోకస్ పెట్టారు. తాజాగా మరో హామీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.. ఈ మేరుకు దరఖాస్తుల్ని కూడా ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చే పనిలో ఉంది. అయితే ఇక్కడ మాత్రం …

Read More »

వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ సస్పెండ్.. ఏపీ మంత్రిపై పోటీచేసి ఓడిన సీనియర్ నేత

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఎదురుగాలి వీచింది. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది.. అయితే ఆ తర్వాత నుంచి వరుసగా కష్టాలు మొదలయ్యాయి. నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.. ఏకంగా ఇద్దరు ఎంపీలు, ముగ్గరు ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పారు. అలాగే వైఎస్సార్‌‌సీపీలో సీనియర్లుగా ఉన్నవారంతా టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోతున్నారు. అయితే వైఎస్సార్‌సీపీ మాత్రం పార్టీ నుంచి ఒకరిద్దరు నేతల్ని సస్పెండ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల మాజీ మంత్రి రోజా నియోజకవర్గంలో కేజే శాంతి, కుమార్ …

Read More »