ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రోడ్డు ప్రమాదాలపై దాఖలైన పిల్‌పై విచారణ జరిగింది. రాష్ట్రంలో హెల్మెట్ ధరించని వాహనదారులపై ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది. 99 శాతం మంది హెల్మెట్ ధరించకుండా బైక్‌లు నడుపుతున్న విషయాన్ని తాము గమనించామని తెలిపింది. విజయవాడలో హెల్మెట్ ధరించిన వారు కనిపించడం లేదని.. హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయాలని తామిచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపింది. అంతేకాదు చట్ట నిబంధనలు అమలు చేయడంలో ట్రాఫిక్ పోలీసులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని.. హెల్మెట్ ధరించనివారికి వారు జరిమానా విధిస్తున్నట్లు తాము …
Read More »