ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేషన్ కార్డులు ఉన్నవారికి తీపికబురు చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల భారం ప్రజలపై పడకుండా పౌరసరఫరాల శాఖ తీసుకుంటున్న చర్యలపై సమీక్ష చేశారు. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. వీలైనంత వరకుప్రజలపై నిత్యావసరాల భారం పడకుండా చూడాలన్నారు. డిమాండ్-సప్లై మధ్య వ్యత్యాసానికి గల కారణాలను విశ్లేషించి …
Read More »