ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేషన్ కార్డులు ఉన్నవారికి తీపికబురు చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల భారం ప్రజలపై పడకుండా పౌరసరఫరాల శాఖ తీసుకుంటున్న చర్యలపై సమీక్ష చేశారు. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. వీలైనంత వరకుప్రజలపై నిత్యావసరాల భారం పడకుండా చూడాలన్నారు. డిమాండ్-సప్లై మధ్య వ్యత్యాసానికి గల కారణాలను విశ్లేషించి …
Read More »Tag Archives: cm
నేడు ప్రధానితో సీఎం భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమ, మంగళవారాల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్‌ప్లాంటు, వరద సాయం తదితర అంశాలే ప్రధాన ఎజెండాగా ప్రధాని మోదీని, పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో హస్తినకు బయల్దేరతారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధానితో సమావేశమవుతారు. ఆ తర్వాత రైల్వే, సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలుస్తారు. మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రోడ్డురవాణా మంత్రి నితిన్ …
Read More »ఏపీలో వారందరి అకౌంట్‌లలోకి డబ్బులు జమ చేస్తాం.. చంద్రబాబు కీలక ప్రకటన
ఏపీలో వరద బాధితులకు ఆర్థిక సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థికసాయం జమకు సంబంధించిన సాంకేతిక సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ నెల 4 (శుక్రవారం) నాటికి అందరికీ పరిహారం పంపిణీ పూర్తి కావాలని.. వరదల వల్ల నష్టపోయిన వారిలో ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండటానికి వీల్లేదు అన్నారు. వరద సాయం పంపిణీలో సమస్యలు, బాధితుల ఫిర్యాదులపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు.. ప్రభుత్వం డబ్బులు …
Read More »ఏపీలో మరో పథకం అమలు.. అకౌంట్‌లో నెలకు రూ.3వేలు, వెంటనే దరఖాస్తు చేస్కోండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పింఛన్ పెంపు, మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల హామీల అమలుపైనా ఫోకస్ పెట్టారు. తాజాగా మరో హామీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.. ఈ మేరుకు దరఖాస్తుల్ని కూడా ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చే పనిలో ఉంది. అయితే ఇక్కడ మాత్రం …
Read More »ఖమ్మంలో భారీ వరదలకు కారణమదే.. ఆ విషయంపై చర్చిస్తాం: సీఎం రేవంత్
తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించిపోయింది. ఖమ్మం జిల్లాలో అయితే వేల మంది నిరాశ్రయులుగా మారారు. మున్నేరు వరదు ఖమ్మం పట్టణాన్ని ముంచెత్తింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన రేవంత్.. ఆక్రమణల వల్లే ఖమ్మం పట్టణాన్ని వరదలు ముంచెత్తాయన్నారు. గతంలో గొలుసు కట్టు చెరువులు ఉండేవని ప్రస్తుతం చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయన్నారు. పట్టణంలో వరదలకు కారణమైన మున్నేరు రిటైర్నింగ్ వాల్ ఎత్తు …
Read More »ఏపీలో మహిళలకు తీపికబురు.. మళ్లీ ఆ పథకం స్టార్ట్.. సీఎం కీలక నిర్ణయం
CM Nara chandrababu naidu Review on Health Department: అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో తన మార్కు చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే 2014 ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన అనేక కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు మరో పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆరోగ్యశాఖ మీద సీఎం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్తగా 2.74లక్షల మంది రైతులకు బీమా..!
రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతు బీమా పథకంలో భాగంగా రైతులకు ప్రభుత్వమే బీమా చెల్లిస్తోన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఎల్‌ఐసీ కింద ఒక్కో రైతుకు రూ.3,600 చొప్పున బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించింది. ఈ ఏడాది ప్రీమియం ఎంత చెల్లించాలనేది త్వరలో ఖరారు కానుంది. రైతు బీమా పథకం ద్వారా రైతులు సహజంగా, లేదా ఏ విధంగానైనా మరణిస్తే, సదరు రైతు కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల …
Read More »సీఎం రేవంత్ దక్షిణ కొరియా టూర్ రద్దు, 2 రోజుల ముందే ఇండియాకు.. క్లారిటీ ఇదే..!?
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా.. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆగస్టు 3వ తేదీన మొదలైన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఆగస్టు 14 వరకు మొత్తం పది రోజుల పాటు కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా.. మొదట అమెరికాకు వెళ్లిన రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం లభించింది. మొదటి రోజు నుంచే రేవంత్ టీం.. ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే.. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువ కొనసాగుతోంది. పెద్ద …
Read More »నేడే తెలంగాణ జాబ్ క్యాలెండర్ విడుదల..
తెలంగాణ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్. ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ప్రణాళిక ప్రకారం ఉద్యోగాల భర్తీ చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో.. శుక్రవారం (ఆగస్టు 2) అసెంబ్లీ (TG Assembly)లో జాబ్ క్యాలెండర్ను ప్రకటించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. యువతకు హామీ ఇచ్చిన ప్రకారం జాబ్ క్యాలెండర్ (Job Calendar) విడుదల చేస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్త చేస్తామని రెండు రోజుల క్రితలం మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించిన …
Read More »ఏపీలో వాలంటీర్లకు గుడ్‌న్యూస్..
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు. సాంఘిక సంక్షేమశాఖపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై చర్చకు వచ్చింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ఆలోచనలు చేయాలని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు. సచివాలయాల్లో ఉద్యోగులు, వాలంటీర్లందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని.. వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న అంశంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ మేరకు ఆ దిశగా కసరత్తు …
Read More »