తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తీపికబురు చెప్పారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేస్తామని ప్రకటించారు. పార్టీకి కార్యకర్తలే బలమని.. వారి త్యాగాలను మర్చిపోలేమన్నారు. ఆదివారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, గ్రామ పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు భావిస్తున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి …
Read More »