తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రైతు రుణమాఫీ, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, ఇటీవల రాజీవ్ గాంధీ విగ్రహం ఇలా పలు అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శల పర్వం నడుస్తోంది. కాగా.. ఇప్పుడు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఒకే నెలలో ఏకంగా 48 మంది శిశువులు, 14 మంది బాలింతలు ప్రాణాలు వదిలినట్టు ఉన్న రిపోర్టులపై వాడీ వేడిగా చర్చ నడుస్తోంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్.. తప్పుడు లెక్కలు చెప్తోందని.. అసలు మరణాల సంఖ్యను దాచిపెడుతోందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. …
Read More »