Tag Archives: haryana

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం.. శంషాబాద్ వెళ్తుండగా ఉన్నట్టుండి..!

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం (అక్టోబర్ 20న) రాత్రి.. హైదరాబాద్ నుంచి బయలుదేరిన బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు.. అకస్మాత్తుగా ఓ వ్యక్తి అడ్డుగా వచ్చాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో.. వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఇలా.. కాన్వాయ్‌లోని 3 వాహనాలు ఒక్కదానికొకటి వరుసగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో బండారు దత్తాత్రేయకు ఎలాంటి ప్రమాదం కాకపోవటంతో అందరూ …

Read More »

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అరుదైన గౌరవం.. బీజేపీ సీఎంలను పక్కన పెట్టి మరీ..!

Chandrababu: హర్యానాలో బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకార మహోత్సవం.. చండీగఢ్‌లోని పంచకుల పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. వీరితోపాటు 18 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సైనీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏలో కింగ్ మేకర్‌గా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు.. …

Read More »

మహిళలకు శుభవార్త.. ప్రతీ నెల అకౌంట్లలోకి రూ.2100, విద్యార్థినులకు స్కూటీలు

హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ.. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 7 గ్యారెంటీల పేరుతో ఎన్నికల మేనిఫేస్టోను విడుదల చేయగా.. తాజాగా బీజేపీ కూడా తమ మేనిఫెస్టోను ప్రకటించింది. హర్యానా వాసులకు కాంగ్రెస్ 7 గ్యారెంటీలు ఇవ్వగా.. బీజేపీ 20 హామీల వర్షం కురిపించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా.. సంకల్ప్ పత్ర పేరుతో 20 పాయింట్ల వాగ్దానాలను ప్రకటించారు. గత ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలను పూర్తిగా …

Read More »

గుడ్‌మార్నింగ్‌ కాదు జై హింద్.. ఆగస్టు 15 నుంచి పాఠశాలల్లో మార్పు

హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లలో కొత్త నిబంధనను తీసుకువచ్చింది. పాఠశాలల్లో గుడ్ మార్నింగ్‌కు బదులు జై హింద్ అని వాడాలని హర్యానా పాఠశాల విద్యా శాఖ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15 వ తేదీన దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హర్యానాలో అధికారంలో ఉన్న నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కీలక ఉత్తర్వులు వెలువరించింది. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే దేశభక్తి, దేశంపై గౌరవం, దేశ ఐక్యతా భావాలను పెంపొందించాలనే ఆలోచనతో …

Read More »