కష్ట సమయంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. ఓ స్నేహితుడిగా ఆమెకు భారత్ సహయం చేయడం అభినందనీయమని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి..బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై జాతీయ మీడియాతో తిరువనంతపురం ఎంపీ మాట్లాడుతూ.. పొరుగు దేశంలో అధికార మార్పిడి విషయంలో భారత్ ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం …
Read More »Tag Archives: Hasina
మా శత్రువుకు సాయం చేస్తే భారత్‌తో సహకారం కష్టమే.. బీఎన్పీ
షేక్ హసీనాకు భారత్ సాయంపై ఆమె ప్రత్యర్ధి పార్టీ బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ (బీఎన్పీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా.. బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు సోమవారం వచ్చిన విషయం తెలిసిందే. ఆమెకు భారత్‌లో తాత్కాలిక ఆశ్రయం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో బీఎన్పీ సీనియర్ నేత, బంగ్లాదేశ్ మాజీ మంత్రి గయేశ్వర్ రాయ్ స్పందించారు. బంగ్లాదేశ్, భారత్ మధ్య పరస్పర సహకారం ఉండాలని బీఎన్పీ బలంగా నమ్ముతుందని ఆయన అన్నారు. ఈ స్ఫూర్తిని అనుసరించే విషయంలో …
Read More »హసీనాకు రక్షణగా రఫేల్ జెట్లు పంపి.. విమానానికి భద్రత కల్పించిన భారత్
రిజర్వేషన్ల కోటాపై గత నెల రోజులుగా బంగ్లాదేశ్‌లో జరుగుతోన్న పరిణామాలను నిశితంగా గమనించి భారత్.. సోమవారం తీవ్రరూపం దాల్చి ప్రధాని షేక్ హసీనా (sheikh Hasina ) పదవి నుంచి తప్పుకోవడంతో మరింత అప్రమత్తమైంది. సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సైన్యం 45 నిమిషాలే సమయం ఇవ్వడంతో ఆమె భారత్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న భారత భద్రతా దళాలు గగనతలంపై నిఘా పెంచాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చే విమానం భారత్‌లోకి సురక్షితంగా ప్రవేశించేలా చూడాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రాడార్లు …
Read More »