హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాల కోలాహలం ఇప్పటికే మొదలైంది. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి సందర్భంగా గణనాథులను ప్రతిష్ఠించగా.. మూడో రోజు నుంచే నగరంలో నిమజ్జనాలు మొదలయ్యాయి. అయితే.. హైదరాబాద్‌లోని బడాబడా గణేషులు తొమ్మిదో రోజున లేదా పదకొండో రోజున గంగమ్మ ఒడికి చేరుకోవటం ఆనవాయతీగా వస్తోంది. ఇందులో భాగంగానే.. సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం రోజున ఖైరతాబాద్ మహగణపతి నిమజ్జనం జరగనుంది. అదే రోజున నగరవ్యాప్తంగా ఉన్న భారీ గణనాథులు కూడా.. గంగమ్మ ఒడి చేరుకునేందుకు హుస్సేన్ సాగర్‌కు క్యూ కట్టనున్నాయి. అయితే.. …
Read More »Tag Archives: Hyderabad
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణాలు వాయిదా వేసుకోండి.. అత్యవసరమైతే ఈ రూట్‌లో వెళ్లండి
విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేవారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.భారీ వర్షాలు, వరదల కారణంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అలాగే చిల్లకల్లు, నందిగామ దగ్గర జాతీయ రహదారి మీదకు నీళ్లు వచ్చాయి. పాలేరు నది పొంగడం, సూర్యాపేట తర్వాత రామాపురం క్రాస్‌రోడ్డు బ్రిడ్జి కూలడంతో.. ప్రజల భద్రతా కారణాల రీత్యా ప్రయాణం వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా వెళ్లాల్సి …
Read More »హడలెత్తిస్తున్న ‘హైడ్రా’.. హీరో నాగార్జున N కన్వెన్షన్ కూల్చివేత
అక్రమ నిర్మాణాల కూల్చివేతతో హాట్ టాఫిక్‌గా మారిన హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) ఎక్కడా తగ్గటం లేదు. ఎవరైతే నాకేంటి అంటూ హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సినీ హీరో నాగార్జునకు చెందిన ఈ కన్వెన్షన్‌ను ఇవాళ ఉదయం భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై తాజాగా హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందింది. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి నాగార్జున …
Read More »పబ్లిక్‌లో అలా చేస్తే చుక్కలే.. హైదరాబాద్ పోలీసుల వార్నింగ్
ప్రస్తుతం యువత పరిస్థితి ఎలా తయారైందంటే.. ఒక్క పూట తినకుండా అయినా ఉండగలరు కానీ.. సోషల్ మీడియా లేనిదే బతుకు భారమనేలా పరిస్థితి తయారైంది. ఉదయం లేచిన దగ్గర నుంచి నేటి యువత సోషల్ మీడియా వెనుక పరుగులు తీస్తున్నారు. పొద్దున లేచింది మొదలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో షార్ట్స్, రీల్స్ అంటూ సెల్‍ఫోన్ పట్టుకుని చక్కర్లు కొడుతున్నారు. సరే ఎవరిష్టం వారిది అనుకున్నా.. తమ రీల్స్, షార్ట్స్ లైకుల కోసం మరీ తెగించేస్తున్నారు. ప్రాణాలకు తెగించి రిస్క్ చేసేది కొంతమంది అయితే.. పక్కోడి ప్రాణాలను …
Read More »ఐటీ కంపెనీ కీలక ప్రకటన.. హైదరాబాద్ హైటెక్‌సిటీలో కొత్త ఆఫీస్ ప్రారంభం.. నియామకాలు షురూ!
Hyderabad New IT Office: తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి కంపెనీలు ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎల్ అండ్ టీ, కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ సహా దిగ్గజ టెక్, ఐటీ సంస్థలు ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చు. ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ సంస్థలు కూడా హైదరాబాద్‌లో కొలువై ఉన్నాయి. దేశీయంగా కూడా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఇలా చాలా కంపెనీలే ఉన్నాయి. ఇక ఐటీ అంటే ముందుగా గుర్తొచ్చేది హైటెక్ సిటీ, గచ్చిబౌలి. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఐటీ …
Read More »HYD: ఘోర ప్రమాదం.. బస్సు కిందికి దూసుకుపోయిన ఆటో.. టెన్త్ అమ్మాయి మృతి
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హబ్సిగూడ ప్రాంతంలో వేగంగా వచ్చిన ఓ స్కూల్ ఆటో.. అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో అతివేగంతో రావటం వల్ల.. బస్సు వెనకాల కిందకు దూసుకుని వెళ్లింది. ఈ ఘటనలో.. ఆటో డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న పదో తరగతి విద్యార్థిని బస్సు కింద ఉరుక్కుపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. క్రేన్ సహాయంతో ఆటోను బస్సు కింద నుంచి తొలగించారు. అమ్మాయితో పాటు ఆటో డ్రైవర్‌ను హుటాహుటిన …
Read More »హైదరాబాద్ వాసులకు అలర్ట్.. కాసేపట్లో భారీ వర్షం, జాగ్రత్తగా ఉండండి
హైదరాబాద్ నగరవాసులకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. కాసేపట్లో నగరంలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత, లేదా రాత్రికి నగరంలో భారీ వర్షానికి ఛాన్స్ ఉందన్నారు. మధ్యాహ్నం వరకు వాతావరణం చాలా తేమగా ఉంటుంది. ఆ తర్వాత అకస్మాత్తుగా క్యుములోనింబస్ తుఫానులు వస్తాయని హెచ్చరిచారు. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. ఉత్తర తెలంగాణలోనూ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, …
Read More »హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా విలయం.. నగరం అతలాకుతలం..!
హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై.. కుండపోతగా వర్షం కుమ్మరిస్తోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా వాన కురుస్తుండటంతో.. నగరంలోని రహదారులన్ని ఒక్కసారిగా జలమయం అయ్యాయి. ఉరుములు మెరుపులతో పాటు భారీ ఈదురు గాలులతో.. వరుణుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. రోడ్లపై ఉన్న వాహనదారులు రోడ్లపైనే వర్షంలో తడిసి ముద్దయిపోయారు. చాలా సేపటి నుంచి కురుస్తున్న వర్షంతో… లోతట్టు …
Read More »తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తుడి భారీ విరాళం.. పెద్ద మనసుతో, ఎంతంటే!
తిరుమల శ్రీవారికి భక్తుల నుంచి విరాళాలు అందుతున్నాయి.. తాజాగా మరొకరు స్వామివారికి భారీ విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్‌లోని పునర్జన్ ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బొమ్ము వెంకటేశ్వర రెడ్డి సోమవారం సాయంత్రం టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.51,09,116/- విరాళంగా అందజేశారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ఆ మేరకు దాత విరాళం చెక్కును అందించారు. అంతేకాదు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ రూ.4.10 లక్షల విలువైన ఎరువులను టీటీడీ ఉద్యానవన విభాగానికి విరాళంగా అందజేశారు. ఈ ఎరువులను తిరుమల, …
Read More »వేణు స్వామిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి.. ఇటీవల అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల వైవాహిక జీవితంపై జాతకం చెప్పిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నరోజునే రంగంలోకి దిగిన వేణుస్వామి.. మూడేళ్లలో వీరిద్దరూ విడిపోతారంటూ జాతకం చెప్పారు. ఈ మేరకు వీరిద్దరి జాతకాలను వేణుస్వామి విశ్లేషణ చేసిన వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన అక్కినేని ఫ్యాన్స్.. వేణుస్వామిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే, తాజాగా వేణుస్వామిపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు అందింది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు …
Read More »