ఏపీలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కృష్ణా జిల్లా ఉపాధి కల్పనా శాఖ, డీఆర్‌డీఏ, ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. గుడివాడలో ఎమ్మెల్యే రాము తన నివాసంలో ఉద్యోగ మేళా పోస్టర్‌ను విడుదల చేశారు.. జిల్లా ఉపాధి కల్పనాధికారి దేవరపల్లి విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ నెల 20న గుడివాడలోని కేబీఆర్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. …
Read More »