ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడిప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. ఈ విషయమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా సెటైర్లు వేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు ప్రశ్నలు వేస్తే.. ముఖ్యమంత్రిగా ఏమైనా మాట్లడవచ్చంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అనడం సిగ్గుచేటంటూ రోజా మండిపడ్డారు. దగ్గుబాటి పురందేశ్వరి.. బావ కళ్లల్లో ఆనందం కోసం కాకుండా భక్తుల కళ్లల్లో ఆనందం చూసేందుకు ప్రయత్నించాలన్నారు. అలాగే గతంలో ఏనాడూ …
Read More »Tag Archives: laddu issue
అబ్దుల్ కలాం కూడా తిరుమలలో ఆ పని చేశారు.. లడ్డూ వివాదంపై బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
Tirumala Declaration: తిరుమల లడ్డూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగు వారికి కొంగు బంగారమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని ప్రసాదంపై చెలరేగిన వివాదం ఏపీతో పాటు తెలంగాణలో కూడా అగ్గి రాజేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ లడ్డూ వివాదంపై తాజాగా.. బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ స్పందించారు. మంగళవారం (అక్టోబర్ 01న) రోజున ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్.. తిరుమలకు వెళ్తానని చెప్పి.. పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నారని ప్రశ్నించారు. …
Read More »తిరుమల లడ్డూలో గుట్కా ప్యాకెట్.. తెలంగాణ భక్తురాలి ఆరోపణపై టీటీడీ క్లారిటీ
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని టీటీడీ తెలిపింది. లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉందంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని.. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు, కొంతమంది భక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదన్నారు. తిరుమలలోని లడ్డూ పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో, శ్రీవారి లడ్డూలను ప్రతిరోజు లక్షలాదిగా తయారు చేస్తారుని.. ఈ లడ్డూల తయారీ కూడా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుందన్నారు. …
Read More »తిరుపతి లడ్డూ నెయ్యి వివాదం వేళ కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం
తిరుపతి లడ్డూ తయారీకి సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపై ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. తిరుపతి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని, జంతువుల కొవ్వు ఉపయోగించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. కర్ణాటకలో అధికారంలో ఉన్న సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాలకు కేవలం …
Read More »