Tag Archives: Minister

పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన మంత్రి సత్యకుమార్

ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన మంత్రి.. వారి కాళ్లు కడిగారు. అనంతరం వారికి దుస్తులు పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల కోసం స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు విరాళాలు వేసుకుని దుస్తులను సమకూర్చారు. వీటిని మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి పంపిణీ చేశారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్​కల సాకారం కావడంలో …

Read More »

టీటీడీకి కొత్త పాలకమండలి!.. దేవాదాయశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు

తిరుపతి లడ్డూ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న వార్తలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామకం చర్చకు వచ్చింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి సైతం తన పదవికి రాజీనామా చేశారు. ఇక నూతన పాలకమండలిని నియమించాల్సి …

Read More »

తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ దర్యాప్తు!.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

తిరుపతి లడ్డూ వివాదం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన సంచలన ప్రకటనతో.. ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. చంద్రబాబు ఆరోపణలకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం దీనిపై స్పందించిన వైఎస్ జగన్.. తిరుమల లడ్డూతో రాజకీయం చేస్తున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ విధానాలను తామేమీ మార్చలేదన్న వైఎస్ జగన్.. ఇదంతా కట్టుకథ అంటూ, డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఆరోపించారు. అయితే …

Read More »

త్వరలోనే అన్ని గ్రామాలకు ఇంటర్నెట్.. 20 MB స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా.. మంత్రి తీపికబురు

తెలంగాణ వాసులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ వినిపించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే తెలంగాణలోని అన్ని గ్రామాలకు ఫైబర్‌ నెట్‌వర్క్‌ అందుబాటులోకి తీసుకొచ్చి ఇంటర్నెట్‌ కనెక్షన్ల సదుపాయం కల్పించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు కీలక ప్రకటన చేశారు. మంగళవారం (సెప్టెంబర్ 17న) రోజున కరీంనగర్‌లో ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న తర్వాత.. స్థానిక ఆర్‌ అండ్‌ బీ గెస్టు హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కీలక ప్రకటన చేశారు. తెలంగాణలోని అన్ని గ్రామాలకు …

Read More »

రూ.2 లక్షల రుణమాపీ కాలేదా..? నో టెన్షన్ అంటున్న మంత్రి తుమ్మల

తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం రైతు రుణమాఫీ చూట్టూనే తిరుగుతున్నాయి. అర్హులందరికీ రుణమాఫీ చేశామని.. కాంగ్రెస్ చెబుతుంటే రైతు రుణమాఫీ డొల్ల అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత నాలుగు రోజుల నుండి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు అనేక విన్యాసాలు చేస్తూ, సోషల్ మీడియా సాక్షిగా, రైతాంగాన్ని తమ అసత్య ప్రచారాలతో ఆందోళన కు గురి చేస్తున్నారని ఫైరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి అమలు చేస్తున్న పథకాలతో ప్రజల్లో పార్టీ పట్ల …

Read More »

మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా యువ అధికారి.. ఏరి కోరి మరీ, ఎవరీ ఆకుల వెంకటరమణ!

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌ ఓఎస్డీగా యువ అధికారి ఆకుల వెంకటరమణ నియమితులయ్యారు. కడప జిల్లా నుంచి ఏరికోరి ఆయన్ను తీసుకొచ్చి మానవ వనరులశాఖలో మంత్రి నారా లోకేష్‌ ఓఎస్డీగా నియమించారు. రమణ గతంలో తూర్పు గోదావరి జిల్లా చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేశారు. అక్కడ గిరిజనులకు ప్రభుత్వ పథకాలను అందించడంలో, జీవన ప్రమాణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు. అక్కడ నుంచి కడప జిల్లా బద్వేలు ఆర్డీవోగా బదిలీ కాగా.. అక్కడ కూడా సమర్థవంతమైన అధికారిగా ప్రశంసలు పొందారు. ఇప్పుడు నారా …

Read More »

Nadendla Manohar: ఏపీవాసులకు గుడ్‌న్యూస్.. నిత్యావసరాల ధరలు తగ్గించిన ప్రభుత్వం

 నిత్యావసరాల పెరుగుదలతో అల్లాడిపోతున్న ఏపీ వాసులకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం శుభవార్తను అందించింది. వంటింట్లో రోజూ ఉపయోగించే కందిపప్పు, బియ్యం, స్టీమ్డ్ బియ్యం ధరలు తగ్గించినట్లు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బుధవారం అధికారులతో సమావేశమైన మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ నిర్ణయాన్ని.. ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇటీవలె ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే ఒకసారి నిత్యావసరాల ధరలను తగ్గించిందని గుర్తు చేసిన మంత్రి నాదెండ్ల.. తాజాగా మరోసారి తగ్గింపు …

Read More »

జీవిత, ప్రమాద బీమాపై జీఎస్టీ ఎత్తేయండి… నిర్మలా సీతారామన్‌కు గడ్కరీ రిక్వెస్ట్

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్‌పై అనేక వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీవిత, వైద్య బీమా పథకాల ప్రీమియంలపై విధించిన జీఎస్టీని ఉప-సంహరించుకోవాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి, సీనియర్ బీజేపీ నేత నితిన్ గడ్కరీ అభ్యర్ధించారు. ఈ మేరకు ఆయన.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి వచ్చిన విజ్ఞ‌ప్తి మేరకు ఆర్థిక మంత్రికి ఈ లేఖ రాస్తున్నట్లు గడ్కరీ …

Read More »

 ఏపీ మంత్రి స్వామికి గాయాలు.. ఎద్దులు ఎంత పనిచేశాయి

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి పెద్ద ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో పోలేరమ్మ కొలుపులు (తిరుణాళ్లు) నిర్వహించారు.. మంత్రి, టీడీపీ నేతలు ఈ వేడుకకు హాజరుకాగా.. అక్కడ ప్రదర్శనకు ఉంచిన ఎడ్లబండ్ల ముందు స్థానిక నేతలు, మంత్రితో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఇంతలో ఒక్కసారిగా ఎద్దులు బెదిరి మంత్రిని తలతో ముందుకు నెట్టాయి. ఈ ఘటనలో మంత్రి స్వామి ముందుకు బోర్లా పడిపోగా.. ఆయన్ను ఎద్దు ముందుకాళ్లతో బలంగా తొక్కింది. వెంటనే …

Read More »

మొదటి దెబ్బతోనే చంద్రబాబు క్యాబినెట్ లో ఛాన్స్ కొట్టేసిన సత్యకుమర్..!

ఈ సారి జరిగిన ఎన్నికలలో తెలుగు దేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీలోకి దిగాయి. ఈ ఎన్నికలలో కూటమికి అద్భుతమైన విజయం దక్కింది. అందులో భాగంగా బిజెపి కి పది అసెంబ్లీ స్థానాలను ఇవ్వగా , అందులో ఎనిమిది స్థానాలలో బిజెపిపార్టీ అభ్యర్థులు గెలుపొందారు. దానితో బిజెపిపార్టీ నుండి ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయా అని ఈ పార్టీ శ్రేణులు , జనాలు అంత ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక నిన్న చంద్రబాబు నాయుడు ఎంతో మంది రాజకీయ సినీ ప్రముఖుల మధ్య ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం వేదికపైనే పలువురు మంత్రులు కూడా ప్రమాణ …

Read More »