ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ రేట్లు తగ్గిన సంగతి తెలిసిందే. ఇటీవల వరుసగా తగ్గి సుమారు 3 సంవత్సరాల దిగువకు కూడా పడిపోయాయి. పలు అంతర్జాతీయ పరిణామాలు ఇందుకు దోహదం చేశాయి. అక్కడ చమురు రేట్లు భారీ స్థాయిలో పడిపోయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురు ఉత్పత్తులపై విండ్‌ఫాల్ టాక్స్ సున్నాకు చేర్చింది. అంతకుముందే పెట్రోల్, డీజిల్ సహా ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్‌ఫాల్ టాక్స్ సున్నాగా ఉండగా.. క్రూడాయిల్‌పై మాత్రం విండ్‌ఫాల్ టాక్స్ …
Read More »Tag Archives: Modi
ఏపీకి కేంద్రం బిగ్ రిలీఫ్.. భారీగా నిధులు విడుదల, ఎన్ని కోట్లంటే
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఊరట ఇచ్చింది.. రాష్ట్రంలోని పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లకు కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.989 కోట్లు విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా ఈ నిధుల్ని అందిస్తున్నట్లుగా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిధులు వారం, పది రోజుల్లో నిధులు ఖజానాకు జమ చేసే అవకాశం ఉంది. గత నెలలో పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లకు 2023-24 సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం ఇచ్చిన రూ.724 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వీటి …
Read More »మోదీ ఓ అద్భుతం.. వచ్చే వారం కలుస్తా.. డొనాల్డ్ ట్రంప్
వచ్చేవారం తమ దేశంలో పర్యటించనున్న భారత్ ప్రధాని నరేంద్ర మోదీని తాను కలుస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మిచిగాన్‌లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ట్రంప్.. ప్రధాని మోదీ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ అద్భుతమైన వ్యక్తి అని ఆకాశనికెత్తేశారు. ‘వచ్చే వారం ఆయన ఇక్కడకు వస్తున్నారు.. నేను కలుస్తాను’ అని అన్నారు. అయితే, ఇరువురి భేటీకి సంబంధించిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో కలుసుకున్నారు. అమెరికా అధ్యక్షుడి …
Read More »సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ ఫోన్.. వరదలపై ఆరా, ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులను, జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో భారీ వర్షం, వరదతో వాటిల్లిన నష్టం ప్రాథమిక వివరాలను సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని, తక్షణ సహాయక చర్యలు చేపట్టామని, ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి తెలియజేశారు. కేంద్ర …
Read More »ఉక్రెయిన్‌లో మోదీ టూర్.. లగ్జరీ ట్రైన్లో ప్రయాణం.. ట్రైన్ ఫోర్స్ వన్ విశేషాలేంటంటే?
Train Force One: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై రెండేళ్లు దాటిపోయింది. అయితే సుదీర్ఘంగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఏ దేశమూ పై చేయి సాధించలేదు. అలాగని ఏ దేశమూ వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఎటూ సాగకుండా ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు సైతం ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ఈ క్రమంలోనే యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. యుద్ధం విరమించాలని ఇప్పటివరకు పలుమార్లు ఇరు …
Read More »Chandrababu Delhi Tour: ప్రధానమంత్రి మోదీతో చంద్రబాబు భేటీ.. చర్చించిన విషయాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలతోపాటుగా ప్రధాని మోదీని కలిశారు చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానమంత్రితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును భరిస్తామని కేంద్రం గతంలో హామీ ఇచ్చింది. అలాగే ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది. కేంద్రం హామీ ఇచ్చిన …
Read More »నాకున్న ఢిల్లీ సోర్స్‌తో చెబుతున్నా.. రేవంత్ చేయబోయేది ఇదే: కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావటం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో చిట్ చాట్‌గా మాట్లాడిన ఆయన.. కేసీఆర్‌కు గవర్నర్ పదవి, కేటీఆర్‌కు సెంట్రల్ మినిస్టర్, కవితకు బెయిల్ ఇవ్వటంతో పాటు రాజ్యసభ సీటు కూడా ఇస్తారని.. హరీష్ రావుకు అసెంబ్లీలో అపొజిషన్ లీడర్ పదవి కట్టెబట్టనున్నట్లు ఆయన కామెంట్లు చేశారు. రేవంత్ చేసిన ఈ కామెంట్లపై తాజాగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీ బీజేపీలో విలీనం కావటం కాదని.. …
Read More »ఢిల్లీకి చంద్రబాబు.. హడావిడిగా వెళ్తున్న ఏపీ సీఎం, రేవంత్ కూడా హస్తినలోనే.. ఎందుకంటే!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతున్నారు. రెండు రోజుల పాటూ ఆయన హస్తినలో ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం విజయవాడ నుంచి ఢిల్లీకి వెళతారు.. 16, 17న అక్కడే ఉంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటూ పలువుర్ని కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించిన వివిధ అంశాల అమలుకు …
Read More »పెన్షన్ల విషయంలో మోదీ సర్కార్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రూ.2 లక్షలు ఫైన్
Supreme Court: కేంద్ర ప్రభుత్వం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం అమలు చేయడంలో చేస్తున్న ఆలస్యంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన సైనిక అధికారులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం ప్రకారం.. పింఛను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్రంగా మండిపడింది. ఈ వన్ ర్యాంక్ వన్ పెన్షన్లపై నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందని సుప్రీం కోర్టు తీవ్రంగా విమర్శించింది. ఈ వ్యవహారంలో నరేంద్ర మోదీ సర్కార్‌కు చివరి అవకాశం ఇస్తున్నట్లు …
Read More »కువైట్ లో అగ్నిప్రమాదం.. వారికి మోడీ సర్కార్ రూ. 2 లక్షల సాయం
Kuwait Fire: కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన భారతీయ కార్మికుల కుటుంబాలకు భారత ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.2 లక్షల సాయం ప్రకటించింది. ఈ సహాయాన్ని ప్రధానమంత్రి సహాయనిధి నుంచి అందజేస్తారు. కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసం 7 లోక్‌కల్యాణ్ మార్గ్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఈ దురదృష్టకర సంఘటనపై ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపడంతో పాటు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు. …
Read More »