శబరిమల అయ్యప్ప ఆలయంలో నవంబరు 16 నుంచి మండల పూజలు ప్రారంభం కానున్నాయి. నెలవారీ పూజల కోసం అక్టోబరు 17న ఆలయం తెరుచుకోగా.. వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. మూడు రోజుల అనంతరం ఆదివారం సాయంత్రం ఆలయాన్ని మూసివేశారు. ముందు రెండు రోజులతో పోల్చితే ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. ఇదిలా ఉండగా, అయ్యప్ప భక్తులకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ప్రత్యేకంగా ఓ రేడియోను ప్రారంభించనుంది. ‘రేడియో హరివరాసనం’ పేరుతో ఆన్లైన్ రేడియో సర్వీసులను త్వరలోనే ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. భౌతికంగా శబరిమలకు రాలేని …
Read More »
Red News Navyandhra First Digital News Portal