Andhra Pradesh Liquor Shop Lottery Women Shops: ఏపీలో మద్యం షాపుల లాటరీ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు లాటరీ ప్రక్రియ ప్రారంభంకాగా.. సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 26 జిల్లాల పరిధిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించగా.. 3,396 మద్యం షాపులకు గాను 345 మహిళలకే దక్కాయి. అంటే రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. 10.20 శాతం షాపులు మహిళలకే లభించాయి. వీటిలో కూడా అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 31, అనకాపల్లిలో 25, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో 24 చొప్పున మహిళలకే …
Read More »Tag Archives: srikakulam
పలాస: యువకుడు ఒకసారి మిస్.. నిమిషాల్లో రెండోసారి చావు తప్పలేదు
శ్రీకాకుళం జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య ఘటన కలకలంరేపింది. అందరూ చూస్తుండగానే రైలు కిందకు దూకడానికి ప్రయత్నించగా తోటి ప్రయాణికులు కాపాడారు.. మళ్లీ రెండోసారి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఓ యువకుడు ఉదయం 7 గంటల సమయంలో.. సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఫలక్‌నుమా రైలులో నుంచి పలాస రైల్వేస్టేషన్‌లో దిగాడు. అక్కడి నుంచి రైలు కదులుతున్న సమయంలో ప్లాట్‌ఫాం నుంచి ట్రైన్ బోగీల మధ్యకు దూకడానికి ప్రయత్నించాడు. వెంటనే గమనించిన తోటి ప్రయాణికులు అతడ్ని పక్కకు లాగేశారు. ఆ ఘటనలో యువకుడి తలకు …
Read More »శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు
శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు కలకలంరేపాయి. ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజాము 3.42 నిమిషాలకు భూమి స్వల్పంగా కంపించినట్లు కొందరు చెబుతున్నారు. ఒక్కసారిగా భూమి నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయని.. అత్యల్పంగా భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. కొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. నమాజ్ చేసేందుకు ఆ సమయంలో తాను లేచానని.. శబ్దాలు విని భయపడి బయటకు వచ్చానని ప్రత్యక్ష సాక్షి జోహార్ ఖాన్ అన్నారు. రెండేళ్ల క్రితం అక్టోబర్‌లో పలుమార్లు స్వల్ప ప్రకంపనలు వచ్చాయని.. వాటితో పోల్చితే నేడు వచ్చినవి …
Read More »శ్రీకాకుళం: చిన్న చేప ముల్లు మత్స్యకారుడి ప్రాణాలు తీసింది.. ఇలా కూడా జరుగుతుందా!
చిన్న చేప ముల్లుకు ఓ నిండు ప్రాణం బలైంది. కుటుంబ పోషణ కోసం పొరుగు రాష్ట్రానికి వెళితే.. ఊహించని ఘటనతో ప్రాణాలే పోయాయి.. ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీకాకుళం రూరల్ మండలం నర్సయ్యపేటకు చెందిన కొమర పోలీసు అనే మత్స్యకారుడికి రేవతి అనే మహిళతో వివాహమైంది.. ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసుకు స్థానికంగా ఉపాధి లేకుండా పోయింది.. దీంతో ఉపాధి కోసం తన తండ్రి అవతారంతో కలిసి గత నెల 28న కర్ణాటక రాష్ట్రం మంగుళూరు వలస వెళ్లాడు. అక్కడ పోలీసుకు …
Read More »పలాసలో వింత దొంగలు.. ప్రభుత్వ ఆఫీస్‌లో ఇదేం పని, ఏం చేశారో తెలిస్తే!
శ్రీకాకుళం జిల్లా పలాసలో విచిత్రమైన ఘటన జరిగింది. స్థానిక గ్రామీణ నీటిపారుదల విభాగం పాత కార్యాలయంలో చోరీ కలకలంరేపింది. ఈ దొంగతనంలో పలు ఫైల్స్ చోరీకి గురైనట్లు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఈ కార్యాలయం వెనుక ఉండే కిటికీ తొలగించిన దొంగలు.. లోపలికి చొరబడ్డారు. దస్త్రాలను మూటలు కట్టి తుక్కు షాపులో దొంగలు అమ్మేసినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా స్క్రాప్ షాప్‌లోని మూటలను గుర్తించారు. ఈ విషయం ఇంజినీరింగ్ అధికారులకు తెలియడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో కలిసి అధికారులు …
Read More »