Tag Archives: telangan

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా విలయం.. నగరం అతలాకుతలం..!

హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై.. కుండపోతగా వర్షం కుమ్మరిస్తోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా వాన కురుస్తుండటంతో.. నగరంలోని రహదారులన్ని ఒక్కసారిగా జలమయం అయ్యాయి. ఉరుములు మెరుపులతో పాటు భారీ ఈదురు గాలులతో.. వరుణుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. రోడ్లపై ఉన్న వాహనదారులు రోడ్లపైనే వర్షంలో తడిసి ముద్దయిపోయారు. చాలా సేపటి నుంచి కురుస్తున్న వర్షంతో… లోతట్టు …

Read More »