Tag Archives: tirupati laddu issue

లడ్డూ వ్యవహారంలో స్వతంత్ర సిట్ సభ్యులుగా ఏపీ ప్రభుత్వం పంపిన పేర్లు ఇవే.. డీజీపీ వెల్లడి

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు దేశంలో ఎంత ప్రకంపనలు రేపాయో అందరికీ తెలిసిందే. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దీనిపై దర్యా్ప్తు జరగాలని.. స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటుపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో ఏపీ పోలీసుల జోక్యం ఉండదని స్పష్టం చేశారు. అలాగే తిరుమల లడ్డూ వ్యవహారంలో రాష్ట్ర …

Read More »

తిరుపతి లడ్డూ అంశంపై సుప్రీంకోర్టు సంచలనం.. విచారణకు సీబీఐ సిట్

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.. ఐదుగురు సభ్యులతో.. వీరిలో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలని సూచించింది. తిరుమల లడ్డూ అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే తిరుమల లడ్డూ అంశంపై రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయకూడదని జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది. అంతకుముందు …

Read More »

తిరుమల డిక్లరేషన్ వివాదం.. నా మతం ఇదే, కావాలంటే రాసుకోండి.. వైఎస్ జగన్ ఎమోషనల్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దైంది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో.. శ్రీవారి దర్శనానికి వెళ్తున్నట్లు వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించారు. అందులో భాగంగా శుక్రవారం రాత్రికి తిరుమల చేరుకుని.. శనివారం ఉదయం వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్లు వైసీపీ ఇటీవల తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే వైఎస్ జగన్ తిరుమల పర్యటన అనూహ్యంగా రద్దైంది. ఈ విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కూటమి …

Read More »

తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ దర్యాప్తు!.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

తిరుపతి లడ్డూ వివాదం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన సంచలన ప్రకటనతో.. ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. చంద్రబాబు ఆరోపణలకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం దీనిపై స్పందించిన వైఎస్ జగన్.. తిరుమల లడ్డూతో రాజకీయం చేస్తున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ విధానాలను తామేమీ మార్చలేదన్న వైఎస్ జగన్.. ఇదంతా కట్టుకథ అంటూ, డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఆరోపించారు. అయితే …

Read More »

తిరుపతి లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా.. దేశంలో వేరే సమస్యలు లేవా, సీమాన్ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డూ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందంటూ ఇటీవల వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోకి తిరుమల లడ్డూ వివాదం తెగ చర్చనీయాంశంగా మారింది. దీంతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు తిరుపతి లడ్డూపైనే చర్చ జరుగుతోంది. దేశంలోని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, తిరుమల పవిత్రతకు భంగం కల్గించారని తీవ్ర …

Read More »

తిరుపతి లడ్డూ కాంట్రవర్సీ.. పవన్ కళ్యాణ్‌పై ప్రకాష్ రాజ్ ఫైర్

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా గత 2 రోజులుగా తీవ్ర చర్చనీయాంశమైన అంశం తిరుపతి లడ్డూ. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు ఉపయోగించారని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. దీంతో కోట్లాది మంది శ్రీవారి భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అదే సమయంలో ఈ వ్యవహారం కాస్తా రాజకీయంగా తీవ్ర దుమారానికి కారణం అయింది. తిరుపతి లడ్డూ తయారీకి సంబంధించి నాణ్యమైన నెయ్యి వాడటం లేదని కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లింది. ఇక …

Read More »