ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ (Mpox) వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్ మిగతా ఖండాల్లోని దేశాలకు పాకుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించి.. సమీక్షచేపట్టారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేశారు. తాజాగా, మంకీపాక్స్‌పై పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అంతర్జాతీయ విమానాశ్రయాలకు కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలు చేసింది. వీటితో పాటు బంగ్లాదేశ్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని పోర్టుల దగ్గర కూడా నిఘా పెంచాలని …
Read More »Tag Archives: virus
హైదరాబాద్‌ను వణికిస్తోన్న నొరో వైరస్.. వేగంగా పెరుగుతున్న కేసులు..
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోకముందే ప్రజలను మరో కొత్త వైరస్ భయపెడుతోంది. అత్యంత వేగంగా వ్యాపించే నొరో వైరస్.. ఇప్పుడు హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇవ్వటమే కాకుండా వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ కారణంగా.. కేవలం పాతబస్తీ ప్రాంతంలోనే రోజుకు 100 నుంచి 120 కేసులు నమోదవుతున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వెల్లడించింది. ఈ నొరో వైరస్ విషయంలో ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. నొరో వైరస్‌తో జాగ్రత్తగా ఉండాలంటూ ట్విట్టర్ వేదికగా జీహెచ్ఎంసీ పలు సూచనలు చేసింది. …
Read More »