వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో సెల్ఫీ తీసుకుని మహిళా కానిస్టేబుల్‌ను చిక్కుల్లో పడ్డారు. గుంటూరులో జిల్లా జైలు దగ్గర బుధవారం వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌తో సెల్ఫీ తీసుకున్నారు.. జైలులో మహిళా కానిస్టేబుల్ ఆయేషాబానుకు ఛార్జి మెమో ఇస్తామని జైలర్ రవిబాబు తెలిపారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బుధవారం జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస్‌రెడ్డిని వైఎస్ జగన్ పరామర్శించారు.. అనంతరం జైలు బయట వచ్చిన …
Read More »Tag Archives: visakhapatnam
విశాఖ ఎయిర్‌పోర్టులో కొత్త సేవలు.. ఇక ఆ ఇబ్బందులు తప్పినట్లే..
ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. విశాఖపట్నం విమానాశ్రయంలో నూతన సేవలు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ విమానాశ్రయం నుంచి నిత్యం ఎంతోమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్టు కార్యకలాపాలను మరింత సులభతరం చేసేందుకు కేంద్రం విశాఖపట్నం విమానాశ్రయంలో డిజి యాత్ర సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. శుక్రవారం కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సేవలను ప్రారంభించారు. విశాఖపట్నంతో పాటుగా రాంచీ, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, పట్నా, గోవా, కోయబత్తూరు సహా 9 చోట్ల డిజి యాత్ర సేవలను అందుబాటులోకి తెచ్చారు. …
Read More »విశాఖ ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. ఫోన్ కాల్‌తో ఆగిపోయిన విమానం, ఎంత పని చేశావు నాయనా!
విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హైడ్రామా నడిచింది. ఒక ఫోన్ కాల్‌తో విమానం ఆగిపోగా.. అధికారులు, భద్రతా సిబ్బంది కొద్దిసేపు పరుగులు పెట్టారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి అందరూ అవాక్కయ్యారు.. ఆ విమానం ఆలస్యంగా బయల్దేరి వెళ్లింది. సీన్ కట్ చేస్తే.. విమానాశ్రయానికి నిర్ణీత సమయంలో చేరుకోలేకపోయిన ఓ ప్రయాణికుడి విమానాన్ని కాసేపు ఆపేందుకు ఇలా చేసినట్లు తేలింది. ఢిల్లీ నుంచి విశాఖపట్నంకు ఎయిరిండియా విమానం మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు బయల్దేరింది. అక్కడ విమానం ఎక్కాల్సిన ఒక ప్రయాణికుడు సమయానికి చేరుకోలేకపోయాడు. ఎలాగైనా …
Read More »విజయవాడ కోసం మేమున్నామని.. విశాఖ జీవీఎంసీకి సెల్యూట్
విజయవాడకు వచ్చిన కష్టాన్ని చూసి యావత్ రాష్ట్రం చలించిపోయింది. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా తోడ్పాటును అందిస్తున్నారు.. బెజవాడకు అండగా ఉంటామని భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడకు సాయాన్ని అందిస్తున్నారు. రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, చిరు వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు వదర బాధితులకు అవసరమైన ఆహారం, కూరగాయలు, మంచినీళ్లు, పండ్లు, మందులు అందిస్తున్నారు. అయితే విజయవాడలో వరద ప్రభావం మెల్లిగా తగ్గిపోతోంది.. కొన్ని ప్రాంతాల్లో వరద పోయి బురద మిగిలింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక …
Read More »తెలుగు ప్రజలకు అలర్ట్.. భారీగా రైళ్లు రద్దు చేశారు..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమైన గమనిక.. భారీ వర్షాలు, వరదల కారణంగా రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడ డివిజన్‌లో రైల్వే ట్రాక్స్ దెబ్బ తిన్నాయి. ఈ కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ డివిజన్లో రాయనపాడు వద్ద రైల్వే ట్రాక్స్ పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో పలు రైళ్లను రద్దు చేశారు. తాజాగా గోదావరి ఎక్స్‌ప్రెస్ సహా 19 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కొన్ని …
Read More »నలుగురి ప్రాణం తీసిన కలుషితాహారం.. రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటన
అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో కలుషితహారం తిని నలుగురు విద్యార్థులు చనిపోయిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. చనిపోయినవారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో మాట్లాడిన చంద్రబాబు.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. అలాగే చనిపోయిన నలుగురు విద్యార్థుల కుటుంబసభ్యులకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఇప్పటికే హోం మంత్రి …
Read More »గంజాయికి అవకాడోతో చెక్.. ఎకరాలో పండిస్తే ఇంత లాభమా? ఐడియా అదిరింది గురూ
మన్యం ప్రాంతాలలో ఎక్కువగా ఇబ్బందులు పెట్టే సమస్యలు.. ఒకటి మావోయిస్టులు.. రెండు గంజాయి. ఇక విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా సహా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయిని అక్రమంగా సాగు చేస్తుంటారు. పోలీసులు దాడులు చేసి ధ్వంసం చేస్తున్నప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు, అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. అయితే ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం గంజాయి మహమ్మారిని అరికట్టడానికి కీలక చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే గంజాయి సాగు నుంచి మన్యం ప్రాంతాల వాసులను మళ్లించేందుకు …
Read More »చెన్నై టు విశాఖపట్నం వయా సికింద్రాబాద్.. ఆ బ్యాగు అక్కడికి చేరింది, ఆ దొంగ మంచి చేసినట్లేనా!
చెన్నై టు సికింద్రాబాద్ ఏంటి.. బ్యాగు విశాఖకు చేరడం ఏంటి అనుకుంటున్నారా?.. అవును సినిమా రేంజ్‌లో ఓ స్టోరీ జరిగింది. ఓ ఉద్యోగికి సంబంధించి బ్యాగు కహానీ ఇది. చెన్నైలో మొదలై సికింద్రాబాద్ మీదుగా విశాఖపట్నానికి చేరింది. తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన కార్తికేయన్‌కు హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చింది. ఈనెల 8న యువకుడు ఉద్యోగంలో చేరేందుకు శబరి ఎక్స్‌ప్రెస్‌లో కాట్పాడి నుంచి సికింద్రాబాద్ బయలుదేరాడు. రైలులో కార్తికేయన్ నిద్రలోకి జారుకున్నారు.. ఆ తర్వాత కొంతసేపటికి లేచి చూస్తే అతడి బ్యాగు మాయమైంది. నిద్రలేచిన కార్తికేయన్.. …
Read More »విశాఖలో భారీ అగ్ని ప్రమాదం.. డైనో పార్కులో మంటలు
విశాఖ నగరంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బీచ్ రోడ్డులోని డైనో పార్క్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఉదయం వేళ ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనలో ఆస్తినష్టం ఎంత మేర జరిగిందన్నది తెలియాల్సి ఉంది.బీచ్ రోడ్డులో జీవీఎంసీ నుంచి స్థలాన్ని లీజుకు తీసుకొని కొందరు వ్యక్తులు ఈ డైనో పార్క్ రెస్టో కేఫ్‌ని నిర్వహిస్తున్నారు. కేఫ్ మొత్తం వెదురు బొంగులతో నిర్మించడంతో …
Read More »ఏపీలో మరోసారి ఎన్నికలు.. ఆగస్టు 30న పోలింగ్, మూడు జిల్లాల్లో కోడ్ అమల్లోకి
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైఎస్సార్‌సీపీ తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్ గెలిచారు. అయితే ఆయన జనసేన పార్టీలో చేరగా.. అనంతరం అనర్హత వేటు వేయడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. ఆ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్ వచ్చిందని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఆగస్టు 6న ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలవుతుంది.. …
Read More »