ఏపీలో పేదల కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్ల కోసం విరాళాలు భారీగా వస్తున్నాయి. రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీసుకొచ్చిన అన్న క్యాంటీన్ల కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోషిత్ రూ.కోటి విరాళం అందజేశారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్‌కు ఈ మేరకు రూ. కోటి చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ శిష్ట్లా లోహిత్ ను అభినందించారు. లోహిత్ ఇప్పటికే కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ గా సమర్థవంతమైన సేవలు అందిస్తున్నారన్నారు. అననా క్యాంటీన్ల కోసం లోహిత్ లాంటి పారిశ్రామికవేత్తలు పెద్దఎత్తున ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదన్నది చంద్రబాబు గారి ఆశయమని పేదల ఆకలి తీర్చేందుకు ఎంత ఖర్చుచేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఐదేళ్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదలు నరకం చూశారని.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో వారి కళ్లల ఆనందం కనబడుతోందన్నారు శిష్ట్లా లోహిత్.బచంద్రబాబునాయుడు, లోకేష్‌ల స్పూర్తితో ఇకముందు కూడా సంక్షేమ కార్యక్రమాలకు తమవంతు సహాయ, సహకారాలు అందిస్తానని తెలిపారు లోహిత్. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో తన వంతుగా అన్న క్యాంటీన్లకు విరాళం అందజేసినట్లు తెలిపారు.