నారా లోకేష్ ‘రెడ్ బుక్‌’కు N-కన్వెన్షన్‌ కూల్చివేతకు లింక్.. గాదె ఇన్నయ్య సంచలన కామెంట్స్

ప్రస్తుతం హైడ్రా (HYDRA) అనేది.. టాక్ ఆఫ్ ది సిటీగానే కాకుండా.. స్టేట్ మొత్తం హాట్ టాపిక్‌గా మారిపోయింది. కేవలం తెలంగాణ వరకే కాకుండా.. పక్క రాష్ట్రాల్లోనూ హైడ్రా గురించి చర్చ నడుస్తోందంటే.. బుల్డోజర్ల ప్రభావం గట్టిగానే పడిందని అర్థమవుతోంది. అందుకు కారణం.. చెరువులు, కుంటలతో పాటు ప్రభుత్వ భూములు కాపాడుకోవాలన్న లక్ష్యంతో ఏర్పడిన హైడ్రా.. సామాన్యులా, సెలెబ్రిటీలా, రాజకీయ ప్రముఖులా అనేది చూడకుండా.. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా.. అక్రమకట్టడాలపై బుల్డోజర్లు ప్రయోగిస్తుండటమే. ముఖ్యంగా.. టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ సెంటర్ కూల్చివేతతో.. ఒక్కసారిగా హైడ్రా పేరు మారుమోగిపోయింది.

అయితే.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా ఎలాంటి రాగద్వేషాలకు ఒత్తిళ్లకు తలొగ్గదనే సంకేతం ఇవ్వాలని చూసినా.. ఈ విషయంపై అసలు వివాదం కూడా మొదలైంది. దీన్ని కొంత మంది స్వాగతిస్తే.. మరికొంత మంది వ్యతిరేకిస్తున్నారు. గతంలో అధికారులు అనుమతులిస్తేనే నిర్మాణాలు చేపట్టామని.. నాగార్జున హైకోర్టును కూడా ఆశ్రచించటంతో.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు ఎలాంటి పర్మిషన్ లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరించారు. ఇంత వరకు చర్చ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఇప్పుడు సరికొత్త అంశం తెరపైకి వచ్చింది.

ఎన్ కన్వెన్షన్ కూల్చేవేతకు.. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్‌కు సంబంధం ఉందని.. తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక విశ్లేషకుడు గాదె ఇన్నయ్య సంచలన కామెంట్లు చేశారు. ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో N కన్వెన్షన్ కూల్చివేతపై స్పందిస్తూ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. “ఎన్ కన్వెన్షన్ కూల్చేశావ్ సరే.. మరి నీ బిడ్డ వివాహ వేడుకలు, విందు వేడుకలు అందులోనే చేశావుగా. ఆ సమయంలోనూ నువ్వు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడే చేశావు కదా మరి అప్పుడు సోయి, సిగ్గు లేదా?” అంటూ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా కీలక వ్యాఖ్యలు చేశారు.

“చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూసేందుకే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చేసి.. నేను మొగాన్ని అంటూ గొప్పలు చెప్పుకుంటున్నావ్.” అంటూ రేవంత్ రెడ్డిపై గాదె ఇన్నయ్య కీలక ఆరోపణలు చేశారు. అసలు ఎన్ కన్వెన్షన్‌కు చంద్రబాబుకు ఏం సంబంధం అని అడిగితే.. “నారా లోకేష్‌ దగ్గర ఓ రెడ్ బుక్ ఉందంటా. అందులో నాగార్జున పేరు కూడా ఉందటా. వాళ్ల రెడ్ బుక్‌లో ఉన్న వాళ్లకు సంబంధించిన భూములు గానీ, ఆస్తులు గానీ, భవనాలు గానీ, కన్వెన్షన్లు గానీ.. కూల్చడానికి నువ్వు పని చేస్తావా.?” అంటూ రేవంత్ రెడ్డికి ఇన్నయ్య ప్రశ్నించారు.

“హైడ్రా హైడ్రామాగా మిగిలిపోవద్దంటే.. నువ్వు మొగోడివి అని నిరూపించుకోవాలంటే ఫస్ట్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి ఆక్రమణలకు గురైన చెరువులను వెలికి తీయాలి. అంతేకాకుండా.. నువ్వు 6 అంతస్తులో 9 అంతస్తులో కూర్చుంటున్న సెక్రటేరియట్ కూడా ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లోనే ఉంది. ఎన్టీఆర్ ఘాట్, బీఆర్కే భవన్, బుద్ధ భవన్, ఐమాక్స్ థియేటర్‌తో పాటు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతానంటూ హడావుడి చేస్తున్న స్థలం కూడా బఫర్ జోన్‌లోకే వస్తుంది.” అంటూ గాదె ఇన్నయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *