అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. రాండాల్ఫ్‌ సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా.. ఐదుగురు ఎన్ఆర్ఐలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక మహిళ సహా ముగ్గురు ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఉన్నారు. దక్షిణ బాన్‌హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో స్టేట్ హైవేపై సాయంత్రం 6.45 గంటలకు (అమెరికా కాలమానం) రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనను మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు.. ఈ ప్రమాదంపై టెక్సాస్‌ పబ్లిక్‌ సేఫ్టీ వర్గాలు ప్రకటన చేశారు.

ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో చనిపోయినవారిని తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన తిరుమూరు గోపి.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన రాజినేని శివ, హరితలుగా గుర్తించారు. హరిత భర్త సాయి చెన్ను తీవ్రంగా గాయపడగా.. ఆయన పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. ఆయనకు ఆస్పత్రిలో వైద్యం కొనసాగుతోంది. ఈ ప్రమాదంపై అమెరికాలో తెలుగు సంఘాల ప్రతినిధులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ఈ ప్రమాదంలో చనిపోయిన గోపి, శివ, హరితల మరణంపై సంతాపాన్ని వ్యక్తం చేశారు. సాయి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

గత నెలలో అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ముగ్గురు హైదరాబాద్‌కు చెందినవారు చనిపోయారు. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు, తమిళనాడుకు చెందిన మరొకరు కలిసి కార్‌ పూలింగ్‌‌లో బెన్‌టోన్‌విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఓ వాహనంలో బయల్దేరారు. ఆ తర్వాత రోడ్డుపై వీరి వాహనాన్ని వేరే వాహనాలు వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టాయి.. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఆర్యన్‌ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్‌ పాలచర్లతో పాటుగా తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్‌ చనిపోయారు.
డల్లాస్‌లో బంధువును కలిసి ఇంటికి వెళ్తున్న ఆర్యన్‌ రఘునాథ్, భార్యను కలిసేందుకు లోకేష్, యూనివర్సిటీకి వెళ్తున్న దర్శిని వాసుదేవన్, ఫరూఖ్‌ ఈ కారులో ఎక్కారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనానికి మంటలు చెలరేగడంతో బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.

About rednews

Check Also

ప్రధాని మోదీ పూజలు చేసిన జెషోరేశ్వరి కాళీ మాత బంగారు కిరీటం మాయం..

దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాల సందడి నెలకొంది. ఘనంగా దుర్గాపూజ పండుగను జరుపుకుంటున్నారు. దుర్గాపూజ సందర్భంగా, అటు బంగ్లాదేశ్‌లో 4 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *