అంబానీ, అదానీ కానేకాదు.. దేశంలో బెస్ట్ కంపెనీగా ఆ టెక్ సంస్థ..!

ఈ సంవత్సరానికి సంబంధించి ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల జాబితాను విడుదల చేసింది టైమ్స్ మ్యాగజైన్. టైమ్ బెస్ట్ కంపెనీస్ 2024 పేరుతో లిస్ట్ విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1000 కంపెనీలను చేర్చింది. టైమ్ బెస్ట్ కంపెనీల లిస్టులో ఈసారి భారత్‌ నుంచి మొత్తంగా 22 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. అయితే, దేశీయ కంపెనీలలో బెస్ట్ కంపెనీగా ఏ అదానీ సంస్థనో, ముకేశ్ అంబానీ సంస్థనో ఉంటుందని అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. దిగ్గజ సంస్థలన్నింటినీ వెనక్కి నెట్టి ఓ టెక్ సంస్థ దేశంలోనే అత్యుత్తమమైన కంపెనీగా అగ్రస్థానంలో నిలిచింది. అదే ప్రముఖ టెక్ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Technologies).

టైమ్ విడుదల చేసిన భారత్‌లో బెస్ట్ కంపెనీగా అగ్రస్థానంలో నిలిచిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వరల్డ్ జాబితాలో 112 ర్యాంక్ సాధించింది. ఆ తర్వాత భారత్ నుంచి ఇన్ఫోసిస్ నిలవగా ప్రపంచ ర్యాంక్ 119గా ఉంది. ఆ తర్వాత విప్రోకు 134వ ర్యాంక్, మహీంద్రా గ్రూప్ 187వ ర్యాంక్ సాధించాయి. బ్యాంకుల విభాగంలోకి వెళ్తే యాక్సిస్ బ్యాంక్ 504 ర్యాంకుతో ముందు వరుసలో ఉంది. దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 551 ర్యాంక్ సాధించింది. అందరి ఆలోచనల్లో ఉండే ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 646వ ర్యాంక్ సాధించింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ 736వ ర్యాంక్ తో సరిపెట్టుకుంది.

కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల సంతృప్తి, ఆదాయాల్లో వృద్ధి, సమానత్వం, సుస్థిరత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న టైమ్.. ఈ జాబితాను సిద్ధం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 50 దేశాల్లో 1,70,000 మంది ఉద్యోగులపై సర్వే నిర్వహించినట్లు వెల్లడించింది. అలాగే 2021, 2023 వరకు కంపెనీల వృద్ధిని సైతం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. 2023 నాటికి 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న కంపెనీలను లెక్కలోకి తీసుకున్నట్లు వెల్లడించింది.

About rednews

Check Also

Dana Cyclone: ఏపీపై దానా తుఫాన్‌పై ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుఫాన్‌గా బలపడి హబాలిఖాతి నేచర్ క్యాంప్‌ (భిత్తర్కనిక)-ధమ్రాకు సమీపంలో తీరం దాటినట్లు ఏపీ విపత్తుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *