శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు లక్కీ డిఫ్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేస్తామని టీటీడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 21వ తేదీ వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారణ సేవా టికెట్ల విడుదల చేస్తామని పేర్కొన్నారు.

నవంబరు 9న శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పుష్పయాగం సేవ టికెట్లను 22వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు వివరించారు. 22న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ ఆర్జిత సేవా టికెట్ల విడుదల చేస్తామన్నారు. 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్లు, 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు విడుదల చేస్తామని చెప్పారు.

23న మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, దివ్యాంగుల టోకెన్ల కోటా, 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా విడుదల చేయనున్నట్లు వివరించారు. తిరుమల, తిరుపతిల‌లో నవంబరు మాసం గదుల కోటాను 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *