TTD Darshan Tickets : తిరుమల (TTD Temple)కు వెళ్లే శ్రీవారి భక్తులకు దర్శనం టికెట్లు అంత ఈజీగా దొరకవు. ప్రత్యేక దర్శనం, సేవా టికెట్లను ఒకటి రెండు నెలల ముందే బుక్ చేసుకోవాలి. పోనీ.. ఉచిత దర్శనానికి వెళ్దామంటే రోజంతా క్యూ లైన్‌లో ఉండాలి. మరి 300 రూపాయల దర్శనం టికెట్లు లేని వారు.. గంటల పాటు క్యూలైన్‌లో వెయిట్ చేయలేని ఖచ్చితంగా టికెట్లు బుక్ చేసుకోవాల్సిందే. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే.. ఏదైనా ఒక టికెట్ ఉండాలి. 300 రూపాయల ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు.. లేదంటే కనీసం SSD టోకెన్ అయినా ఉండాలి.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు అక్టోబర్ 22న విడుదల కానున్నాయి. 2025 జనవరి నెల కోటాను ఈనెల 22న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు టీటీడీ (Tirumala Tirupati Devasthanams) అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. https://ttdevasthanams.ap.gov.in/ వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
తిరుమల రూ.300 దర్శన్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఇలా బుక్ చేసుకోవచ్చు:
- మొదట టీటీడీ (Tirumala Venkateswara Temple) అధికారిక వెబ్‌సైట్ https://www.tirumala.org/ ఓపెన్ చేయాలి
- తర్వాత హోమ్ పేజీలోని ఆన్‌లైన్ బుకింగ్ ఎంపిక మీద క్లిక్ చేయాలి.
- ఆన్‌లైన్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి మీరు ఆన్‌లైన్ అకౌంటును కలిగి ఉండాలి.
- ఒకవేళ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి
- ఈ-మెయిల్ ID, పాస్‌వర్డ్ ఉపయోగించి హోమ్ పేజీలో నేరుగా లాగిన్ కావొచ్చు.
- లాగిన్ అయిన తరువాత ఈ-ఎంట్రీ దర్శన్ ఎంపికను ఎంచుకోవాలి.
- తర్వాత ఎంత మంది దర్శనానికి వెళుతున్న వ్యక్తుల వివరాలను నమోదు చేయాలి. అలాగే మీకు అవసరమైతే అదనపు లడ్డూలు కూడా ఎంచుకోవచ్చు.
- తేదీని ఎంపిక చేసుకుని అందుబాటులో ఉన్న టైమ్ స్లాట్‌లను ఎంచుకోని ముందుకు కొనసాగడానికి ‘కంటిన్యూ’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు యాత్రికులుగా మీతో పాటు వచ్చే ఇతర వ్యక్తుల వివరాలను నమోదు చేయాలి.
- చెల్లుబాటు అయ్యే ID లను నమోదు చేయాలి.
- ఇది పూర్తయిన తర్వాత పేమెంట్ ఎంపికపై క్లిక్ చేసి మీకు అనుకూలమైన మోడ్ ప్రకారం ఆన్‌లైన్‌లో డబ్బును చెల్లించాలి.
- పేమెంట్స్ విజయవంతమైన తర్వాత మీరు మీ టిక్కెట్లను PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Red News Navyandhra First Digital News Portal