తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో టీటీడీ అడిషనల్ ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భోజనం రుచి, నాణ్యత గురించి భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం భక్తులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. భోజనం రుచి, నాణ్యత చాలా బాగుందని భక్తులు అడిషనల్ ఈవో దగ్గర ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రాజేంద్ర, స్పెషల్ క్యాటరింగ్ అధికారి శాస్త్రి పాల్గొన్నారు. తిరుమలలో అన్నప్రసాదంపై టీటీడీ ఫోకస్ పెట్టింది.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తోంది. స్వయంగా టీటీడీ ఈవో జే శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
Red News Navyandhra First Digital News Portal