బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. మీ ఖాతా అడ్రస్ మార్చారా? చూసుకోండి మరి

Banking: బ్యాంక్ అకౌంట్ తీసుకున్ని సంవత్సరాలు గడుస్తుంటుంది. కొందరికి ఒకటికి మించి అకౌంట్లు ఉంటాయి. కొందరు ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. ఇలా చిరునామా మారినప్పటికీ బ్యాంక్ ఖాతాలో మాత్రం పాత అడ్రస్ కొనసాగిస్తుంటారు. ఇలా చేయడం పెద్ద పొరపాటు అని చెప్పవచ్చు. మీరు చిరునామా మారినప్పుడల్లా బ్యాంక్ అకౌంట్‌లోనూ వివరాలను అప్డేట్ చేయాలి. ఆర్థిక వ్యవహారాల్లో బ్యాంక్ అకౌంట్ కీలకమైనది. ఇందులో మన అడ్రస్, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ వంటి వివరాలనూ ఎప్పుడూ అప్డేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే చాలా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు మారినప్పుడు బ్యాంక్ ఖాతాలో అడ్రస్ అప్డేట్ చేయకపోవడం, మొబైల్ నంబర్ మార్చితే ఖాతాలో పాత నంబరే కొనసాగించడం వంటివి చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. బ్యాంకుల నుంచి వచ్చే సమాచారం మనకు అందతు. ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. అందుకే అకౌంట్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ వివరాలు మనకు వెంటనే తెలిసేలా ఏర్పాటు చేసుకోవాలి. మొబైల్ నంబర్, ఇ-మెయిల్ వంటివి అప్డేటెడ్ గా లేకపోతే వివరాలు తెలియవు. అలాగే మీ ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు ఎక్స్‌పైరీ అయితే కొత్త కార్డులను ఖాతాలో ఉన్న అడ్రస్‌కు పంపిస్తుంది బ్యాంక్. అప్పుడు పాత అడ్రస్ ఉంటే అక్కడికే వెళ్తాయి. దీంతో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

బ్యాంక్ అకౌంట్లో అడ్రస్ మార్చాలంటే అందుకు కొన్ని ప్రూఫ్స్ కావాలి. ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, యుటిలిటీ బిల్లులు, రెంట్ అగ్రిమెంట్ వంటివి బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. నేరుగా బ్యాంకు బ్రాంచీకి వెళ్లి ఇవన్ని ఇచ్చి అప్డేట్ చేసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్ లేదా మొబైల్ యాప్ సాయంతో అడ్రస్ మార్చుకునేందుకు బ్యాంకులు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే, ఆన్‌లైన్ ద్వారా మార్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. మీ నుంచి అభ్యర్థన వచ్చిన తర్వాత బ్యాంక్ దానిని పరిశీలిస్తుంది. అన్ని వివరాలు సరిపోలితేనే కొత్త అడ్రస్ అప్డేట్ చేస్తుంది. మరి మీరు మీ బ్యాంక్ ఖాతాలో వివరాలన్నీ కొత్తవే ఉన్నాయేమో చూసుకుని లేకపోతే వెంటనే అప్డేట్ చేసుకోండి మరి.

About rednews

Check Also

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త.. వచ్చే నెల నుంచి పక్కా, చాలా తక్కువ ధరకే

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో రైతు బజార్ల ద్వారా వంటనూనె, కందిపప్పును …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *