విశాఖలో ఓ అపార్ట్‌మెంట్‌లో గుట్టుగా.. పోలీసులు డోర్ తీయగానే, అమ్మాయిలతో అడ్డంగా దొరికిపోయారు

విశాఖపట్నంలో సరికొత్త దందా బయటపడింది. నగరంలో కాస్మొటిక్స్‌ అమ్మకాల ముసుగులో ఆన్‌లైన్‌ బెట్టింగ్, ఇతర ఆన్‌లైన్‌ మోసాలు చేస్తున్న గ్యాంగ్ ఆటకట్టించారు పోలీసులు. ఓ అపార్ట్‌మెంట్ కేంద్రంగా ఈ తతంగం మొత్తం నడుస్తుండగా.. విశాఖ సైబర్‌ క్రైమ్, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. ఈ గ్యాంగ్ చైనా కేంద్రంగా నడిచే ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు.. మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు.

పోలీసులు చెబుతున్న వివరాల ఇలా ఉన్నాయి.. విశాఖపట్నంకు చెందిన సూర్యమోహన్‌ హాంకాంగ్, తైవాన్‌‌కు వెళ్లొచ్చారు. అనంతరం నగరానికి చెందిన సాయిరామ్, గిరిష్‌లతో పరిచయం అయ్యింది. ఈ ముగ్గురిలో సాయిరామ్‌కు సైబర్‌ కేటుగాళ్లకు లింక్ ఉంది.. వారికి బ్యాంకు అకౌంట్‌లను సమకూర్చిన అనుభవం ఉంది. ఈ ముగ్గురు నగరంలోనే ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని.. తాము కాస్మొటిక్‌ను వియత్నాంకు ఎగుమతులు చేస్తున్నట్లు అందరినీ నమ్మించారు. ఆ ఫ్లాట్‌లో కాల్‌సెంటర్‌ తరహాలో ఓ ఆఫీస్‌ను ఏర్పాటు చేసి విశాఖ కేంద్రంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు.

ఈ బెట్టింగ్‌ల ద్వారా వచ్చిన డబ్బుల్ని అనధికార గేట్వేల ద్వారా చైనా సంస్థలకు బదిలీ చేస్తున్నారు. అంతేకాదు ఈ ఫ్లాట్‌లో ఏర్పాటు చేసిన కార్యాలయంలో షిప్టుల విధానంలో ఆరుగురు యువతులు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. విశాలాక్షినగర్‌లో నగదు లావాదేవీల కోసం ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ ముగ్గురు బెట్టింగ్‌ సొమ్ము చెల్లింపులకు టీఆర్‌ఎక్స్‌ పేమెంట్ గేట్వేను ఉపయోగించారు. ఈ బెట్టింగ్ వ్యవహారంపై సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేసి ప్రధాన నిందితులు ముగ్గురు సహా మొత్తం ఏడుగుర్ని అరెస్ట్ చేశారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *