వార ఫలాలు (సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7, 2024 వరకు): మేష రాశికి చెందిన వారికి ఈ వారం ఆదాయ వ్యవహారాలన్నీ లాభసాటిగా పూర్తవుతాయి. వృషభ రాశికి చెందినవారికి ఆదాయానికి లోటుండకపోవచ్చు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మిథున రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు ఉండే అవకాశం ఉంది. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం కొనసాగుతాయి. మీ పని తీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయ వ్యవహారాలన్నీ లాభసాటిగా పూర్తవుతాయి. ఒకరిద్దరు బంధుమిత్రులకు అండగా నిలబడడం జరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండదు కానీ, కుటుంబం మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆశించిన శుభవార్త వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వారమంతా మిశ్రమ ఫలితాలతో సాగిపోతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకుంటారు. ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించినంతగా లాభం ఉండకపోవచ్చు. ఉద్యోగ జీవితంలో అధికారులు ఎక్కువగా మీ మీద ఆధారపడే అవకాశం ఉంది. హోదా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. కుటుంబపరంగా ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి ఇబ్బంది పెడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలుంటాయి. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయానికి మించి ఖర్చులు ఉండే అవకాశం ఉంది. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంటా బయటా పని భారం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగి ఇబ్బంది పడతారు. సంపాదనకు సంబంధించి వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. మీ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు, శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ముఖ్యమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పిల్లలతో కొద్దిగా సమస్యలు ఉండే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. గృహ, వాహన సౌకర్యాల విషయంలో జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. ఆర్థిక సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ధైర్యంగా కొత్త నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి జీవితం ఆశించిన విధంగా సాగిపో తుంది. అత్యవసర పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. కొద్దిపాటి అనారోగ్యానికి అవ కాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొందరు మిత్రుల వల్ల వృథా వ్యయం జరిగే అవకాశం ఉంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు, వ్యవహారాలన్నీ బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయపరంగా ఊహించని శుభ ఫలి తాలు అనుభవానికి వస్తాయి. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. అదనపు బాధ్యతల భారం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఆదాయంలో పెరుగుదలకు అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. కొందరు బంధు మిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ధన, భాగ్య స్థానాలు బలంంగా ఉన్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. అదనపు ఆదాయానికి సంబం ధించి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఒకటి రెండు ముఖ్యమైన కోరికలు నెరవేరు తాయి. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి అన్ని విషయాల్లోనూ సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ పెట్టడం మంచిది. బంధుమిత్రులెవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండకపోవచ్చు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. శుభ గ్రహాల అనుకూలత వల్ల సాధారణంగా ఎటువంటి ప్రయత్నం చేపట్టినా తప్పకుండా సఫలం అవు తుంది. వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాలలో అంచనాలకు మించిన లాభాలు గడిస్తారు. నిరుద్యోగులకు తగిన ఆఫర్లు అందుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమ స్యలు పరిష్కారం అవుతాయి. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆశిం చిన పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శి స్తారు. ఇతరుల సమస్యలకు దూరంగా ఉండడం మంచిది. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు పెట్టుకో వద్దు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సన్నిహితులను సైతం గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరుగుతాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానం చేయకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీల వల్ల బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కొత్త అవకాశాలు అందుతాయి. ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఇంటా బయటా బాధ్యతల ఒత్తిడి ఉంటుంది. ప్రయా ణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వాహన యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగపరంగా ఆశించిన శుభవార్త అందుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
అనుకోకుండా ఆదాయం వృద్ధి చెందుతుంది. శ్రమాధిక్యత ఉన్నప్పటికీ అదనపు ఆదాయ ప్రయ త్నాల మీద శ్రద్ధ పెంచుతారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకోవడం కూడా జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. అంచనాలకు మించిన రాబడి ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. మీ వల్ల బంధు మిత్రులు బాగా లాభపడతారు. కొత్త ఉద్యోగానికి సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
గ్రహ బలం ఆశించినంతగా అనుకూలంగా లేనందువల్ల ప్రతి వారితోనూ కాస్తంత ఆచితూచి వ్యవ హరించడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో పని భారం బాగా పెరుగుతుంది. కొద్దిగా అనా రోగ్యాలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో ఘన విజ యాలు సాధిస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరగవచ్చు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఏలిన్నాటి శని ప్రభావం వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇతర విషయాల్లో చిన్నపాటి ప్రయత్నం కూడా ఆశించిన స్థాయిలో విజయవంతం అవుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ముఖ్యమైన విషయాలలోనూ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని సమస్యలను అధిగమిస్తారు. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సమస్యల విషయంలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఏలిన్నాటి శని ప్రభావం వల్ల ఇంటా బయటా బాగా ఒత్తిడి, శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరగడం వల్ల ఇబ్బంది పడతారు. సొంత పనులు మీద దృష్టి పెట్టడం మంచిది. ఆదాయ వ్యయాల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. బంధుమిత్రులతో కొద్దిగా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల ఇబ్బం దులుంటాయి. కొద్ది వ్యయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం శ్రేయస్కరం.