ఈ ఫుడ్స్‌ని రెగ్యులర్‌గా తింటే ఫాస్ట్‌గా బరువు తగ్గుతారట..

మనం తీసుకునే ఆహారంతోనే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కాబట్టి, డైట్ అలవాట్లని మారిస్తే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎంత డబ్బు ఖర్చుపెట్టినా ఆహారపు అలవాట్లు మార్చుకోకపోతే మళ్ళీ చెడు కొలెస్ట్రాల్ పెరుగుతూనే ఉంటుంది. మీరు కంట్రోల్ చేయడానికి, కొలెస్ట్రాల్ బర్న్ చేయాలనుకుంటే కొన్ని ఫుడ్స్ మీ డైట్‌లో యాడ్ చేసుకోవాలి. అవేంటంటే..

కొబ్బరినూనె..

కొబ్బరినూనె..

కొబ్బరినూనె మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. రోజు ఓ చెంచా కొబ్బరినూనెని ఖాళీ కడుపుతో తీసుకుంటే జీవక్రియ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

గుడ్లు..

గుడ్లు..

గుడ్లలో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. గుడ్డులో ప్రోటీన్స్‌తో పాటు ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే పొట్ట చాలా సమయం పాటు కడుపు నిండుగా ఉన్నట్లుగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బరువు కంట్రోల్‌లో ఉంటుంది.

బఠానీలు..

బఠానీలు..

పచ్చి బఠానీల్లో సూక్ష్మ పోషకాలతో పాటు ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. మనం ఆహారంలో బఠానీలని తక్కువగా తీసుకుంటాం. కానీ, ఇందులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఇవి కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచడంలో సాయడతాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చేస్తుంది. శరీర బరువుని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

పెరుగు..

పెరుగు..

పెరుగు కూడా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడమే కాకుండా మంచి బ్యాక్టీరియా ఉత్పత్తిని ప్రేరేపించి, ప్రేగు కదలికల్ని మెరుగ్గా చేస్తుంది. పెరుగుని ఉదయం, మధ్యాహ్నం తేడా లేకుండా ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఉదయాన్నే తీసుకుంటే మరీ మంచిది. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించి జీవక్రియని పెంచుతుంది. శరీర బరువుని కూడా తగ్గిస్తుంది.

ఫ్యాటీ ఫిష్..

ఫ్యాటీ ఫిష్..

చేపలలో ఒమేగా 3 సహా ప్రోటీన్స్, మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సాల్మన్ చేపల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటితో పాటు మాకేరెల్, సార్డినెస్ వంటి చేపల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని వారానికి 2, 3రోజులు తీసుకోండి. దీని వల్ల కండరాలు పెరుగుదల మెరుగ్గా ఉంటాయి. దీంతో పాటు శరీర బరువు కూడా తగ్గుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

నట్స్..

నట్స్..

నట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. వాటిలో హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిని తింటే ఆకలి కంట్రోల్ అవుతుంది. తిన్న తర్వాత చాలా సేపటి వారకూ కడుపు నిండుగా ఉంటుంది. ఈ విధంగా మీరు బరువు పెరగకుండానే పోషకాలను పొందొచ్చు.

గమనిక : ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

About rednews

Check Also

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. రాండాల్ఫ్‌ సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా.. ఐదుగురు ఎన్ఆర్ఐలు ప్రాణాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *