మాచర్లలో పిన్నెల్లికి బిగ్ షాక్.. బెయిల్ వచ్చిందన్న ఆనందం కూడా మిగల్లేదుగా!

మాచర్ల రాజకీయం మరో మలుపు తిరిగింది.. ఊహించినట్లే మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగిరింది. శుక్రవారం మున్సిపాలిటీ నిర్వహించిన అత్యవసర సమావేశంలో 16 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు తెలుగు దేశం పార్టీలో చేరారు. మొత్తం 31 మంది కౌన్సిలర్లలో 16 మందితోపాటు, టీడీపీకి చెందిన ఎమ్మెల్యే ఓటుతో కలిపి 17కు బలం పెరిగింది. మున్సిపల్ ఛైర్మన్‌ ఎన్నికకు కోరం 16 మంది ఉండటంతో.. టీడీపీ తరఫున ఛైర్మన్‌గా డిప్యూటీ ఛైర్మన్‌ పోలూరి నరసింహారావును ఎన్నుకున్నారు. దీంతో మాచర్ల మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలోకి చేరింది.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికలు జరిగితే.. మొత్తం 31 స్థానాలు వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవం చేసుకుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం వైఎస్సార్‌సీపీ తరఫున ముందుగా తురకా కిషోర్, అనంతరం బోయరఘురామిరెడ్డి, ఏసోబు ఛైర్మన్‌లుగా పనిచేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. దీంతో మాచర్లలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. మాచర్ల నుంచి టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ క్రమంలో కొందరు మున్సిపల్ కౌన్సిలర్లు కొందరు టీడీపీలో చేరారు.

సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీ మున్సిపల్ ఛైర్మన్‌ ఏసోబు ఆరోగ్యసమస్యల కారణంగా సెలవు పెట్టారు. దీంతో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుడు పోలూరి నరసింహారావు ఛైర్మన్‌‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. మొత్తం 16 మంది కౌన్సిలర్లు అధికార పార్టీలోకి రావడం.. ఎమ్మెల్యే ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఉండటంతో లైన్ క్లియర్ అయ్యింది. మాచర్ల మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలోకి చేరింది. అయితే నరసింహరావును యాక్టింగ్ ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు.. మరోసారి కౌన్సిల్‌ సమావేశమై ఛైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. వరుసగా మూడు సమావేశాలకు కౌన్సిలర్లు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుంది.. వైఎస్సార్‌సీపీకి మిగిలిన 15 మంది కౌన్సిలర్లలో ఒకరు వరుసగా సమావేశాలకు హాజరుకావడం లేదు. దీంతో అనర్హత వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగిలిన వారిలోనూ కొందరు టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *