ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్‌.. స్మార్ట్‌టీవీలు, Apple iPhone, Google, Samsung ఫోన్లపై భారీ డిస్కౌంట్‌లు

Flipkart Flagship Sale 2024 : స్వాతంత్య్రదినోత్సవం 2024 సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘ఫ్లాగ్‌షిప్ సేల్’ తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోని లైవ్ మైక్రోసైట్ ప్రకారం.. ఫ్లాగ్‌షిప్ సేల్ ఆగస్టు 6వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆగస్టు 6 మధ్యాహ్నం 12 గంటలకు ఈ Flagship Sale ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా.. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. వివరాల్లోకెళ్తే..

ఈ సేల్‌లో భాగంగా ఫ్యాషన్‌ ఉత్పత్తులపై 50-80 శాతం, టీవీలు సహా ఇతర ఉత్పత్తులపై 80 శాతం, ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం, స్మార్ట్‌ గ్యాడ్జెట్‌లపై 50-80 శాతం వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్‌లో భాగంగా.. ఐఫోన్ 14 ప్లస్‌ (128జీబీ) ధర భారీగా తగ్గింది. ఐఫోన్ 14 ప్లస్‌ అసలు ధర రూ. 79,600గా ఉండగా.. రూ.53,999కి అందుబాటులో ఉంది. ఈ ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా ఐఫోన్‌ 14 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతం అత్యంత తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఈ మోడల్‌ 6.7 అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 5nm A15 బయోనిక్‌ చిప్‌సెట్‌పైన పనిచేస్తోంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ 12MP+12MP కెమెరాలు సహా 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.54,999 కే సొంతం చేసుకోవచ్చు. గూగుల్ పిక్సెల్ 7 (30999), శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ (38999), మోటో ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌ (21999), పోకో ఎఫ్6 (25999) లాంటి స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.

అలాగే.. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ కొనుగోళ్లపై 10 శాతం తక్షణ తగ్గింపును కూడా అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంకు ఆఫ్ బరోడా కార్డ్ మరియు యెస్ బ్యాంక్‌లపై 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్ ఇస్తోంది. వినియోగదారులు ఎంచుకున్న వస్తువులపై నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు సేల్ సమయంలో ప్రత్యేకమైన సూపర్ కాయిన్స్ ఆఫర్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు. వినియోగదారులు పూర్తి వివరాలను https://www.flipkart.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

About rednews

Check Also

TCS Campus in Vizag: విశాఖలో క్యాంపస్ ఏర్పాటు.. ప్లాన్ మార్చిన టీసీఎస్!.. అక్కడేనా?

ఏపీలోని యువతకు శుభవార్త.. విశాఖపట్నంలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. టాటా సన్స్ బోర్డు ఛైర్మన్ నటరాజన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *