TCS Campus in Vizag: విశాఖలో క్యాంపస్ ఏర్పాటు.. ప్లాన్ మార్చిన టీసీఎస్!.. అక్కడేనా?

ఏపీలోని యువతకు శుభవార్త.. విశాఖపట్నంలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. టాటా సన్స్ బోర్డు ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో భేటీ అనంతరం.. ఏపీలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం 100 రోజుల్లోనే విశాఖపట్నంలో టీసీఎస్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేస్తామని.. నారా లోకేష్ ఇటీవల మరోసారి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. అయితే వేగంగా టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని.. కార్యకలాపాలు ప్రారంభిస్తామని నారా లోకేష్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు విశాఖపట్నంలో సొంతంగా భవనాలు నిర్మించడం కష్టం కావున టీసీఎస్ మరో ప్లాన్ అమలు చేస్తున్నట్లు తెలిసింది.

సొంతంగా భవనాల నిర్మాణం ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు కావున.. భవనాలను అద్దెకు తీసుకోవాలని టీసీఎస్ వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. విశాఖలో క్యాంపస్ ఏర్పాటు కోసం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీస్ స్పేస్ కావాలని టీసీఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రుషికొండ ఐటీ హిల్స్‌లోని మిలీనియం టవర్స్‌లో క్యాంపస్ ఏర్పాటుపై ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఇది కాకుండా మరో రెండు ప్రైవేటు భవనాలు అద్దె తీసుకునే విషయంపైనా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. రుషికొండ ఐటీహిల్స్ మిలీనియం టవర్స్‌లో ఓ భవనం ఖాళీగా ఉంది. ఇదైతే టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుకు సరిగ్గా సరిపోతుందనే ఆలోచన ఉంది.

అయితే మిలీనియం టవర్స్ సెజ్ ఏరియాలో ఉండటంతో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుకు కొన్ని నిబంధనలు ఫాలో కావాల్సి ఉంటుందని తెలిసింది. దీంతో విశాఖపట్నంలో విశాలంగా ఉండే ప్రైవేట్ భవనాలను సైతం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వీలైనంత త్వరగా విశాఖలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయాలని అటు ప్రభుత్వం.. ఇటు టీసీఎస్ వర్గాలు పట్టుదలగా ఉన్నాయి. క్యాంపస్ ఏర్పాటు తర్వాత పలు దశలలో 15వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని టీసీఎస్ సంస్థ ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం మిలీనియం టవర్స్ లేదా మరో ఇతర ప్రాంతంలో ఎక్కడైనా క్యాంపస్ ఏర్పాటు చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని.. ఆ తర్వాత రానున్న రోజుల్లో సొంతంగా క్యాంపస్ నిర్మించుకోవాలనేది టీసీఎస్ ప్లాన్‌గా తెలిసింది.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *