ఇన్వెస్టర్ల పంట పండింది.. ఒక్కరోజే ఏకంగా 40 శాతం పెరిగిన షేరు.. ఆ ఒక్క కారణంతోనే!

Multibagger Stocks: మీరు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారా. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కాస్త రిస్క్‌తో కూడుకున్నదని చెబుతుంటారు. అదే సమయంలో మంచి అవగాహనతో.. మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తూ సరైన సమయంలో సరైన స్టాక్ ఎంచుకొని పెట్టుబడులు పెడితే లాంగ్ టర్మ్‌లో బంపర్ ప్రాఫిట్స్ అందుకోవచ్చని నిపుణులు అంటుంటారు. ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇందుకోసం ముఖ్యంగా మార్కెట్లపై అవగాహన పెంచుకోవడం దగ్గర్నుంచి.. ఆయా కంపెనీల పనితీరు, ఫలితాలు, పెట్టుబడి వ్యూహాలు, ప్రకటనలు ఇలా అన్నింటినీ గమనిస్తూ సరైన టైంలో పెట్టుబడి పెట్టాలి. కొన్ని స్టాక్స్ ఊహించని విధంగా ఒక్కసారిగా భారీగా పెరుగుతుంటాయి. కొన్ని అదే రీతిలో పడిపోతుంటాయి. దీనికి కారణం తెలుసుకోవాలి. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాయో ఒక అంచనాకు రావాలి.

ఇండియాలో చాలా వరకు స్టాక్స్ ఒక్కరోజులో మహా అంటే 5 శాతం, 10 శాతం.. మహా అంటే 20 శాతం, 25 శాతం వరకు పెరుగుతుంటాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే స్టాక్.. అమెరికా స్టాక్ మార్కెట్ నాస్‌డాక్‌లో లిస్టయి ఉంది. ఇది ఒక్క సెషన్లోనే ఏకంగా 40 శాతానికిపైగా పెరగడం గమనార్హం.

అవును ఆగస్ట్ 23 ట్రేడింగ్‌లో అమెరికన్ ఎక్సర్‌సైజ్ ఎక్విప్‌మెంట్ అండ్ మీడియా కంపెనీ అయిన పెలొటన్ ఇంటరాక్టివ్ INC సంస్థ ఏకంగా 35.42 శాతం పెరిగి 4.55 యూఎస్ డాలర్ల వద్ద సెషన్ ముగించింది. కిందటి సెషన్లో 3.36 వద్ద క్లోజ్ అవగా.. ఇవాళ ఒక దశలో ఇంట్రాడేలో ఏకంగా 41 శాతం పెరిగి 4.75 డాలర్ల వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 35 శాతం పెరిగి స్థిరపడింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట విలువ వచ్చేసి 7.24 డాలర్లుగా ఉంది. గత 5 సెషన్లలో ఇది 40 శాతం పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మాత్రం 20 శాతానికిపైగా, ఏడాది వ్యవధిలో 16 శాతం మేర తగ్గింది.

అమెరికా స్టాక్స్ అయినా మన దగ్గర కూడా ట్రేడింగ్ చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. ఈటీఎఫ్‌ల ద్వారా డీమ్యాట్ అకౌంట్ ఉన్న వారు నాస్డాక్ షేర్లు ట్రేడింగ్ చేసుకునేందుకు కొన్ని ప్లాట్‌ఫామ్స్ అవకాశం కల్పిస్తుంటాయి. దీంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు కాసుల పంట పండిందని చెప్పొచ్చు. ఇక ఈ కంపెనీ స్టాక్ ఇంతలా పెరిగేందుకు ప్రధాన కారణం 9 త్రైమాసికాల్లో తొలిసారి ఈ సంస్థ తన సేల్స్ పెంచుకోవడం విశేషం. దీంతో వాల్ స్ట్రీట్ అంచనాల్ని అధిగమించింది. నాలుగో త్రైమాసికంలో ఈ స్టేషనరీ బైస్కిల్స్, ట్రెడ్‌మిల్స్, ఇండోర్ రోవర్స్ ప్రొడక్ట్స్ అందించే ఈ సంస్థ సేల్స్ 0.2 శాతం పెరిగింది. 2022 రెండో త్రైమాసికం తర్వాత తొలిసారి సేల్స్ పెరగడం విశేషం.

About rednews

Check Also

TCS Campus in Vizag: విశాఖలో క్యాంపస్ ఏర్పాటు.. ప్లాన్ మార్చిన టీసీఎస్!.. అక్కడేనా?

ఏపీలోని యువతకు శుభవార్త.. విశాఖపట్నంలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. టాటా సన్స్ బోర్డు ఛైర్మన్ నటరాజన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *