ఏపీలో వాళ్లందరికి రెండు నెలల పింఛన్ కలిపి ఇస్తారు.. ఎందుకంటే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. వారందరికి రెండు నెలలకు కలిపి పింఛన్‌లను పంపిణీ చేయనుంది. సెప్టెంబర్ తొలివారంలో ఏపీలో భారీ వర్షాలు పడ్డాయి. విజయవాడతో పాటుగా పలు జిల్లాలను వానలు, వరదలు ముంచెత్తాయి. సెప్టెంబర్ 1న భారీ వర్షాలు కురవడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీకి మరో రెండు రోజులు సమయం ఇచ్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వెసులుబాటు కల్పించారు. అయితే ఇప్పటికీ మరికొందరు పింఛన్లు అందుకోలేకపోవడంతో.. వారంతా ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

గుంటూరు,ఎన్టీఆర్ జిల్లాల్లో వరదల రీత్యా ఈ నెల పింఛన్‌ తీసుకోలేకపోయిన 2658మంది లబ్ధిదారులకు అక్టోబర్ నెల రెండు నెలల (సెప్టెంబర్ + అక్టోబర్) పింఛన్ పంపిణీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.ఈ మేరకు దీనికి సంబంధించి.. సచివాలయాల వారీగా పింఛన్‌ల కౌంట్, ఎవరెవరికి ఇస్తున్నారో వివరాలను ప్రస్తావించారు. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలోనే ఎక్కువ పెండింగ్ పింఛన్‌లు ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో పింఛన్ తీసుకోలేనివారు ఇప్పటి వరకు క్లారిటీ లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు రెండు నెలలకు కలిపి ఇస్తామని చెప్పడంతో ఆనందం వ్యక్తం చేశారు.

మరోవైపు అక్టోబరు 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఆ రోజు పత్తికొండ మండలం పుచ్చకాయలమాడలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అక్టోబరు 1వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని స్వగృహం నుంచి సీఎం చంద్రబాబు విజయవాడ విమానాశ్రయానికి వెళతారు.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 1.05 గంటలకు పుచ్చకాయలమడ దగ్గరలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

పుచ్చకాయలమండలో ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలుకుతారు. 1.45 గంటలకు పుచ్చకాయలమడకు వెళ్లి.. 2.25 గంటల వరకు కాశీశ్వరస్వామి ఆలయం సందర్శించి అనంతరం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తారు. ఆ తర్వాత 2.25 నుంచి 3.25 గంటల వరకు గ్రామ ప్రజలతో మాట్లాడతారు. సాయంత్రం 3.30 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 4 గంటలకు కర్నూలు (ఓర్వకల్లు) ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి 4.15 గంటలకు విజయవాడకు చేరుకుంటారు. అంతేకాదు పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఒకవేళ నెలలో మొదటి తేదీ ఆదివారం, సెలవు దినం అయితే పింఛన్ పంపిణీని ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనున్నారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *