ఏపీలో రైతులకు శుభవార్త.. 24 గంటల్లోనే అకౌంట్‌లలో డబ్బులు జమ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డబ్బుల్ని రైతుల అకౌంట్‌లకు జమ చేస్తోంది. ఈ అంశంపై మంత్రి నాదండ్ల మనోహర్ స్పందించారు. ‘రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు ఖాతాలో జమ చేస్తామని చెప్పాము. తూ.గో.జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన శ్రీ పోలిశెట్టి శేషయ్య అనే రైతు నుంచి కొనుగోలు చేసిన ధ్యానానికి 24 గంటల్లోనే డబ్బులు జమ చేశాము. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాదు. ఇచ్చిన గడువు కంటే ముందే రైతు నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించింది కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రైతులు, కౌలు రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధి చేస్తున్న ఆలోచన చేస్తున్నారనడానికి ఇదే తార్కాణం’ అంటూ ట్వీట్ చేశారు.

రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా.. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ చేస్తున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు. రైతులకు ధాన్యం ఆరబెట్టుకునేందుకు 50% రాయితీతో టార్పాలిన్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామ కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పులు మిగిల్చినా.. రబీ సీజన్లో రైతులకు ఎగ్గొట్టిన ధాన్యం బకాయిలు రూ.1,674 కోట్లు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందజేసిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని అభిప్రాయపడ్డారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.3,300 కోట్లతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఏ విధంగానూ ఉపయోగపడలేదన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసే వారిపై కఠినమైన చర్యలుంటాయని మంత్రి హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 57వేల మెట్రిక్ టన్నులకుపైగా అక్రమంగా తరలిస్తున్న, నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేశామన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచిస్తోందని.. రైతులకు అండగా ఉన్నామన్నారు మంత్రి.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *