రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కించిన గేమ్ చేంజర్‌ను సంక్రాంతికి బరిలో దించుతున్నాడు దిల్ రాజు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి రాబోయే పాట ఎలా ఉంటుందో అంజలి చిన్న హింట్ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. గేమ్ చేంజర్ పాటల మీద చాలా మందికి అంత హోప్స్ ఏమీ లేవన్న సంగతి తెలిసిందే. జరగండి పాట లీక్ అయి ట్రోలింగ్‌ను మూటగట్టుకుంది. ఆ పాట కూాడా జనాలకు అంతగా ఎక్కలేదు. రా మచ్చా మచ్చా పాట ట్యూన్, బాణీ ఇవేవీ కూడా ఆకట్టుకోలేకపోయాయి. రామ్ చరణ్ డ్యాన్స్ కూడా లిరికల్ వీడియోలో అంత గొప్పగా ఏమీ లేదు.
ఇక గేమ్ చేంజర్ నుంచి దసరాకి రావాల్సిన టీజర్ రాలేదు. అక్టోబర్‌లోనే టీజర్, మూడో పాట రిలీజ్ చేస్తామని దిల్ రాజు అన్నాడు. కానీ దసరాకి టీజర్ పనులు పూర్తి కాలేదని సమాచారం. దీంతో ఎప్పటిలానే టీజర్ వాయిదా పడింది. అలా ఫ్యాన్స్ దెబ్బకు డీలా పడిపోయారు. అక్టోబర్ చివరి వారంలో మూడో పాటను రిలీజ్ చేస్తామని అన్నారు. అక్టోబర్ 30న అంటే దీపావళి రోజున మూడో పాట రాావాల్సి ఉంది.
న్యూజిలాండ్‌లో షూట్ చేసిన డ్యూయెట్ సాంగ్‌ను రిలీజ్ చేస్తారని సమాాచారం. కియారా, రామ్ చరణ్ కాంబోలో ఈ సాంగ్ ఉంటుందని టాక్. అయితే మరో వైపు అంజలి, రామ్ చరణ్ కాంబోలో షూట్ చేసిన పాట విడుదల చేస్తారని అంటున్నారు. ఈ పాట వింటేజ్ మోడ్‌లో ఉంటుందని టాక్. 1990, 80లోకి తీసుకెళ్లేలా ఈ పాటను డిజైన్ చేశారని తెలుస్తోంది.
ఒకే ఒక్కడు మూవీలోని నెల్లూరి నెరజానాలా ఈ పాట ఉంటుందని అప్పుడే రీల్స్ వచ్చేశాయి. రామ్ చరణ్, అంజలిలను పెట్టి ఈ పాటతో ఎడిట్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చివరకు అంజలి వరకు చేరుకున్నాయి. ఈ ఎడిట్ వీడియోలని కూడా అంజలి తన ఇన్ స్టాలో పెట్టేసుకుంటోంది. అంటే గేమ్ చేంజర్ పాట కూడా ఇలానే ఉంటుందని చెప్పకనే చెప్పి అలా హింట్ ఇచ్చేసిందన్న మాట.