రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలను వణికిస్తున్నాయి. గత 2, 3 రోజుల నుంచి కురుస్తున్న ఏకధాటి వర్షానికి నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక జలాశయాలు, ప్రాజెక్టులు నిండిపోవడంతో.. గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇక తెలంగాణలోని ఖమ్మం, హైదరాబాద్.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు.. ప్రళయాన్ని తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మనిషి మునిగే లోతులో వరదనీరు చేరింది. సహాయం కోసం వరద బాధితులు.. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం అమావాస్య కావడంతో.. …
Read More »వరద బాధితులకు డ్రోన్లతో ఆహారం సరఫరా.. పరిశీలించిన సీఎం చంద్రబాబు
ప్రస్తుతం విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వరదలు పోటెత్తడంతో ఎక్కడి జనం అక్కడే చిక్కుకుపోయారు. ఇక ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో.. సామాన్లు మొత్తం నీళ్లలో మునిగిపోయాయి. ఈ క్రమంలోనే జనం అంతా ఇళ్లపైకి ఎక్కి.. ప్రభుత్వం అందించే సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ చేయడమే కాకుండా ఆహారం, తాగునీరు సరఫరా చేస్తోంది. అయితే హెలికాప్టర్లు అన్ని ప్రాంతాలకు వెళ్లడానికి అవకాశం ఉండకపోవడంతో టెక్నాలజీని వాడాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే డ్రోన్ల ద్వారా …
Read More »తెలుగు ప్రజలకు అలర్ట్.. భారీగా రైళ్లు రద్దు చేశారు..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమైన గమనిక.. భారీ వర్షాలు, వరదల కారణంగా రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడ డివిజన్‌లో రైల్వే ట్రాక్స్ దెబ్బ తిన్నాయి. ఈ కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ డివిజన్లో రాయనపాడు వద్ద రైల్వే ట్రాక్స్ పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో పలు రైళ్లను రద్దు చేశారు. తాజాగా గోదావరి ఎక్స్‌ప్రెస్ సహా 19 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కొన్ని …
Read More »విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణాలు వాయిదా వేసుకోండి.. అత్యవసరమైతే ఈ రూట్‌లో వెళ్లండి
విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేవారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.భారీ వర్షాలు, వరదల కారణంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అలాగే చిల్లకల్లు, నందిగామ దగ్గర జాతీయ రహదారి మీదకు నీళ్లు వచ్చాయి. పాలేరు నది పొంగడం, సూర్యాపేట తర్వాత రామాపురం క్రాస్‌రోడ్డు బ్రిడ్జి కూలడంతో.. ప్రజల భద్రతా కారణాల రీత్యా ప్రయాణం వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా వెళ్లాల్సి …
Read More »ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండచరియలు.. ఘాట్ రోడ్డు మూసివేత, ఏడుగురు మృతి
Vijayawada Rains: ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక పలు ప్రాంతాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయవాడ నగరం మొత్తం అతలాకుతలం అవుతోంది. రెండు రోజులుగా ముసురు వానలు కురుస్తుండగా.. శనివారం ఉదయం నుంచి భారీగా వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ నగరం మొత్తం వరదతో నిండిపోయింది. ప్రధాన రహదారులు మొత్తం చెరువులను తలపిస్తున్నాయి. ఇక ప్రముఖ ఇంద్రకీలాద్రి గుట్టపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపై ఉన్న ప్రోటోకాల్ రూమ్‌పై భారీ బండరాళ్లు విరిగిపడటంతో అది …
Read More »ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టీర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బుధవారం కూడా కోస్తా, రాయలసీమలోని పలు …
Read More »విజయవాడ దుర్గ గుడికి వెళ్లే భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఆ మూడు రోజులు ఈ సమయంలో దర్శనాలు నిలిపివేత
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ ఈవో కె.ఎస్ రామారావు కీలకమైన సూచన చేశారు. దుర్గమ్మకు నివేదన సమర్పించే సమయంలో.. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉంటున్నారు. అందుకే ఆ సమయంలో ప్రముఖుల ప్రోటోకాల్ దర్శనాలను నిలిపి వేస్తున్నట్లు దుర్గగుడి ఈవో తెలిపారు. అంతేకాదు శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఇతర రోజుల కంటే ఎక్కువగా ఉంటోంది. ఉదయం 11.30 నుంచి …
Read More »విజయవాడ దుర్గ గుడికి వెళ్తే భక్తులకు గమనిక.. ఆ ఒక్కరోజు దర్శన వేళల్లో మార్పు, ఆర్జిత సేవలు నిలిపివేత
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన ఉన్న దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.. ఈనెల 17 నుంచి 20వతేదీ (శని, ఆది, సోమ, మంగళ) వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల కారణంగా అన్ని ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను నిలిపివేశారు. అలాగే దుర్గమ్మ ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలను అర్చకులు మాత్రమే నిర్వహిస్తారని తెలిపారు ఆలయ అధికారులు. శ్రావణ శుద్ధ త్రయోదశి శనివారం సాయంత్రం 4 గంటలకు దుర్గమ్మ ఆలయంలో ఉదక శాంతి కార్యక్ర మంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 18వ తేదీ …
Read More »నేను పారిపోయే రకం కాదు.. అంత ఖర్మ నాకు లేదు..
తాను దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తే హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు అడ్డుకున్నారంటూ వస్తున్న వార్తలపై వైసీపీ నేత దేవినేని అవినాష్ స్పందించారు. ఉదయం నుంచి తనపై కొన్ని మీడియా ఛానెళ్లలో, టీడీపీ సోషల్ మీడియా ఖాతాల్లో తాను పారిపోయేందుకు ప్రయత్నించానంటూ ప్రచారం జరుగుతోందని దేవినేని అవినాష్ చెప్పుకొచ్చారు. పారిపోవాల్సిన అవసరం, ఖర్మ తనకు పట్టలేదన్నారు. రెండు నెలలుగా విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో, విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉన్నానని చెప్పుకొచ్చారు. తనకు పారిపోవాల్సిన అవసరం లేదన్నారు. కోర్టు తాను తప్పుచేశానని …
Read More »అన్న క్యాంటీన్లకు ప్రతి ఏటా రూ.కోటి ఇస్తానన్న ప్రముఖ వ్యాపారి.. ఆయనకు రూ.100 కోట్లు ఆదాయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించింది. కృష్ణా జిల్లా గుడివాడలో మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలో సంపద ఉన్నవారు అట్టడుగున ఉన్న వారికి సాయం చేసి సమానంగా తీసుకు రావాలని చంద్రబాబు సూచించారు. అన్న క్యాంటీన్ ట్రస్టుకు విరాళాలు అందజేయాలని కోరారు.. వీరి కోసం ప్రత్యేకంగా అకౌంట్ నంబర్ ప్రారంభించారు. ఎస్‌బీఐ ఖాతా నంబరు 37818165097, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఎస్‌బీఐఎన్0020541కు అందించాలన్నారు. వెబ్‌సైట్ ద్వారా కూడా విరాళాలు అందించవచ్చన్నారు. అన్న క్యాంటీన్ల కోసం …
Read More »