తిరుపతి

తిరుపతి లడ్డూ టెస్టు రిపోర్టులో షాకింగ్ అంశాలు.. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందా?

తిరుమల లడ్డూ నాణ్యతపై రాజకీయ దుమారం రేగుతుండగా.. తాజాగా వెలుగులోకి వచ్చిన రిపోర్టులోని మరింత సంచలనంగా మారాయి. తిరుమల వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షల కోసం నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు ల్యాబొరేటరీకి పంపించారు. గుజరాత్‌లోని ఆనంద్‌లో ఉన్న ఈ ల్యాబొరేటరీకి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. తిరుమలలో ఉపయోగించిన నెయ్యికి సంబంధించి ఈ ల్యాబ్ పంపించిన టెస్టు రిపోర్టులో నెయ్యి కల్తీ అయినట్లు తేలింది. నాణ్యమైన నెయ్యి ఎస్ వాల్యూ 95.68 …

Read More »

తిరుపతి లడ్డూ వివాదంపై బండి సంజయ్ ఘాటు స్పందన.. చంద్రబాబుకు స్పెషల్ రిక్వెస్ట్

దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ముఖ్యంగా శ్రీవారి ప్రసాదమైన లడ్డూకు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే.. ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు లడ్డూపై నిన్న(సెప్టెంబర్ 18న) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని హిందువుల్లో ఆందోళన రేకెత్తించటంతో పాటు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తిరుపతి లడ్డూ ప్రసాద తయారీలో జంతువుల కొవ్వుతో తీసిన నెయ్యిని కలిపి.. తిరుమల శ్రీవారి ప్రతిష్టను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగజార్చిందంటూ చంద్రబాబు ఘాటు ఆరోపణలు చేయటం ఇప్పుడు …

Read More »

విశాఖవాసులకు టీటీడీ అద్భుత అవకాశం.. ప్రతిరోజూ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం, ఎక్కడంటే!

విశాఖపట్నంవాసులకు టీటీడీ అద్భుతమైన అవకాశం కల్పించింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నగరంలో కూడా అందుబాటులోకి వచ్చింది. శ్రీవారి ప్రసాదానికి విశేష ఆదరణ వస్తోందని.. అందుకే ఎండాడ శ్రీమహాలక్ష్మీ గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం (టీటీడీ)లో ఇకపై ప్రతి రోజు లడ్డూలు విక్రయించనున్నారు. గతంలో గురు, శుక్ర, శనివారాల్లో మాత్రమే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు జరిగేవని.. భక్తుల కోరిక మేరకు గురువారం నుంచి ఇవి ప్రతిరోజు అందుబాటులో ఉంటాయని ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు ఓ ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీవారి …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఈ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు.. ఎన్ని రోజులంటే!

Tirumala Darshans Cancelled: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కేవలం రెండు వారాలు మాత్రమే సమయం ఉంది. అక్టోబర్ 8వ తేదీన జరగనున్న గరుడసేవ కోసం అన్ని విభాగాల ఏర్పాట్లపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా గ్యాలరీలలోనికి ప్రవేశం, నిష్క్రమణ, హోల్డింగ్ పాయింట్లు, అన్నప్రసాద వితరణ, యాత్రికుల రద్దీ నిర్వహణ, పోలీసుల భద్రత, శ్రీవారి సేవకుల సేవలు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచడం, భక్తుల …

Read More »

తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. దర్శనంపై టీటీడీ కీలక ప్రకటన

తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. కొండపై రద్దీ పెరగడంతో దర్శనం విషయంలో టీటీడీ కీలక ప్రకటన చేసింది. టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని సీఆర్వో జనరల్, నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్‌లను తనిఖీ చేశారు. గత మూడు రోజులుగా వరుస సెలవులు, పురటాసి మాసం రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో పాటు, ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులకు దాదాపు 20 నుండి 24 గంటల సమయం శ్రీవారి దర్శనానికి పడుతోందన్నారు. …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. 

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా.. ఒక నెల ముందుగా నిర్వహించే స్వామివారి పుష్కరిణి మరమత్తు పనులు పూర్తయ్యాయి. కొత్త హంగులతో స్వామి పుష్కరిణిని సిద్ధం చేయగా.. ఆదివారం నుంచి శ్రీవారి భక్తులను టీటీడీ అనుమతించారు. కాగా ఈ మరమత్తు పనులు టీటీడీ ఆగష్టు 1వ తేదీన ప్రారంభించిన విషయం విదితమే. ఇందులో భాగంగా స్వామి పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి, నీటి అడుగ భాగంలో పేరుకున్న ఇసుకను, పాచిని తొలగించడానికి వాటర్‌వర్క్స్‌ విబాగంవారు దాదాపు 100మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి స్వామి పుష్కరిణి …

Read More »

తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం.. చెన్నై భక్తుడు పెద్ద మనసుతో, కొండపై పరిశుభ్రత కోసం

తిరుమల శ్రీవారికి చెన్నైకు చెందిన సంస్థ లారీని విరాళంగా అందజేసింది. చెన్నైకి చెందిన ట్రేటికొ ఇంజనీరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ కార్తీక్ ‌ టీటీడీకి చెందిన లారీ చేసేస్ కు రూ.8 లక్షల విలువగల బాడి ఫిట్ చేసి తిరుమల శ్రీవారికి విరాళంగా అందించారు. ఈ మేర‌కు లారీ రికార్డుల‌ను తిరుమలలోని శ్రీవారి ఆలయం చెంత టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందించారు. ముందుగా వాహనానికి పూజలు నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ రవాణా విభాగం జీఎం శేషారెడ్డి, …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై ప్రతి శనివారం ఆన్‌లైన్‌లో టోకెన్లు, బుక్ చేస్కోండి

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు చెప్పింది. ప్రతి శనివారం తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులకు కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టోకెన్లు.. ఇకపై లక్కీడిప్ ద్వారా కేటాయించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ అంగప్రదక్షిణ టోకెన్లు కావాల్సిన భక్తులు గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ ఆధార్ కార్డుతో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత వీరికి సాయంత్రం 5 గంటలకు లక్కీడిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తారు. ఇలా లక్కీడిప్ లో టోకెన్లు పొందిన భక్తులకు …

Read More »

శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో బయటపడిన కొత్త రకం మోసం

Tirumala: శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది.. తిరుమలకు చేరుకుంటారు. అయితే రాష్ట్రం కాని రాష్ట్రం నుంచి వచ్చే భక్తులకు అక్కడి నిబంధనలు, సౌకర్యాలు తెలియవు. అయితే ఇలాంటి భక్తులను టార్గెట్ చేసుకుని మోసాలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వెరైటీ మోసం వెలుగులోకి వచ్చింది. లాకర్ల పేరుతో భక్తులను బెదిరింటి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. దీని వెనుక ఎవరి హస్తం ఉంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దితుడిని …

Read More »

తిరుమలలో విషాదం.. శ్రీవారి దర్శనానికి వెళుతూ నవ వరుడు మృతి

తిరుమలలో విషాదం జరిగిది.. శ్రీవారి దర్శనానికి వెళుతూ నవ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. అలిపిరి మెట్లదారిలో శ్రీవారి దర్శనానికి నడిచి వెళుతుండగా.. గుండెపోటుతో చనిపోయాడు. నవీన్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.. ఆయనకు 15 రోజుల క్రితం వివాహమైంది. నవీన్ శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి తిరుపతికి వచ్చారు.. అక్కడి నుంచి కాలినడకన అలిపిరి మెట్లమార్గంలో తిరుమలకు బయలుదేరారు. నడుకుకుంటూ 2,350వ మెట్టు దగ్గరకు రాగానే.. నవీన్‌ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్న భద్రతా సిబ్బందికి …

Read More »